పాక్ నుంచి ఫోన్ కాల్స్: భయాందోళనలో గోదావరి వాసులు
పశ్చిమగోదావరి: పాకిస్థాన్ ఫోన్ కోడ్ ఉన్న నెంబర్లతో ఫోన్‌కాల్స్ వస్తుండటంపై పశ్చిమగోదావరి జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం, తదితర ప్రాంతాల్లో +92 3045414385 నంబరుతో, 0092 కోడ్‌తో ఫోన్‌కాల్స్ రావడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
కాగా, పలు ప్రాంతాల సమాచారం సేకరించేందుకు పాకిస్థాన్ హ్యాకర్లు ఈ కాల్స్ చేస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరో పక్క వాట్సప్ తదితర సోషల్ మీడియాలో ఇండియన్ ఆర్మీ హెచ్చరిక అంటూ వస్తున్న మెసేజ్‌లు, ఫొటోలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

అయితే ఇందులో వాస్తవాలను సేకరించి తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాంటి కోడ్‌తో వచ్చే ఫోన్ కా ల్స్‌ను రిసీవ్ చేసుకోవద్దని భద్రతా వార్గాలు పేర్కొన్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఎక్కువ సార్లు పాకిస్థాన్ కోడ్‌తో ఫోన్ కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించడం మేలను పలువురు అంటున్నారు.












Click it and Unblock the Notifications