నారా లోకేష్ తో సాధినేని యామినికి లింకేంటి ? వైసీపీ నేత సుధాకర్ బాబు ఘాటు వ్యాఖ్యలు
వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సాధినేని యామినిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు యామిని మాట్లాడుతుందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీ నేత, మంత్రి నారాలోకేష్ కి ఆ పార్టీ అధికార ప్రతినిధి యామినీ సాధినేనికి మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించారు వైసీపీ నేత సుధాకర్ బాబు.

లోకేష్ కు యామినికి మధ్య లింకేంటి .. లోకేష్ ను ప్రశ్నిస్తే యామిని ఎందుకు స్పందిస్తోంది
అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన...అసలు యామినికి, లోకేశ్‌కు మధ్య లింకేంటి.. ఆయనను ప్రశ్నిస్తే, ఆమె ఎందుకు స్పందిస్తోందని ప్రశ్నించారు. తమ పార్టీ నేత విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోయి తాబేదార్లతో తాళాలు మోగిస్తున్నారని సుధాకర్ బాబు మండిపడ్డారు.

సెలెక్టెడ్ ఆర్టిస్టులతో టీడీపీ ఆఫీసులో ఇష్టా రాజ్యంగా మాట్లాడిస్తున్న టీడీపీపై సుధాకర్ బాబు ఫైర్
సెలెక్టెడ్ ఆర్టిస్టులతో టీడీపీ ఆఫీసులో ఇష్టానురీతిలో మాట్లాడిస్తున్నారని సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ గ్రిడ్స్ అశోక్ విషయంలో నారా లోకేశ్ ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. అసలు లోకేష్ ను ఏమి అడిగినా యామిని ఎందుకు స్పందిస్తుందో అంటూ ఎద్దేవా చేశారు .ఇక గత రెండు రోజులుగా వైసీపీ అధినేత జగన్ పై యామిని ఎందుకు అంతలా పెట్రేగిపోతోందని అర్ధం లేకుండా మాట్లాడుతోందని సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు .

టీడీపీ నేతలు కల్లు తాగిన కోతుల్లా ఇష్టారాజ్యం మాట్లాడుతున్నారని సుధాకర్ మండిపాటు
లోకేశ్ కోసం యామిని, యనమల కోసం కుటుంబరావు మీడియా ముందుకొస్తున్నారని మరి చంద్రబాబు కోసం ఎవరు వస్తారని సుధాకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక దేవినేని ఉమాకు సిగ్గుందా.. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు కల్లు తాగిన కోతుల్లా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని సుధాకర్ మండిపడ్డారు. కానీ సాధినేని యామినిపై సుధాకర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications