విశాఖ గర్జ్జన దేనికి? జగన్ సర్కార్ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ గర్జించిన పవన్ కళ్యాణ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార విపక్ష పార్టీల మధ్య ఈనెల 15వ తేదీన పోటాపోటీగా కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. 15వ తేదీన విశాఖ వైసిపి గర్జన జరగనుండగా అదే రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన మూడు రోజుల పాటు కొనసాగబోతోంది. దీంతో రసవత్తరంగా రాజకీయం మారింది. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు..

సోషల్ మీడియా వేదికగా విశాఖ గర్జనను టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణ,మూడు రాజధానులకు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 15వ తేదీన విశాఖ గర్జన పేరుతో కార్యక్రమాన్ని చేపడుతుండగా, ఈనెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా 16వ తేదీన విశాఖలో జనవాణి నిర్వహించడంతోపాటు ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు.
ఇక 15 వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమంపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర గా ఏపీని మార్చాలన్న పవన్ కళ్యాణ్
వికేంద్రీకరణ అని చెప్పే బదులు యునైటెడ్ స్టేట్స్ అఫ్ ఆంధ్ర గా రాష్ట్రాన్ని ప్రకటించాలని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలోని రుషికొండ పర్వతశ్రేణుల్లో ఉన్న ఈ మౌంట్ దిల్ మాంగే మోర్ ధన వర్గ కుల స్వామ్యానికి చిహ్నం పి. ఎస్ బూతులకు కూడా అంటూ పవన్ కళ్యాణ్ వైసిపి నేతల తీరును ఎద్దేవా చేశారు. వైసిపి మూడు రాజధానులు కంటే రాష్ట్రంలో 26 జిల్లాలను 26 రాష్ట్రాలు గా మార్చాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అప్పుడు దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రా గా పేరు పెట్టొచ్చని ఎద్దేవా చేశారు.

విశాఖ గర్జన దేనికి ? ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
ఇక తాజాగా మరోమారు విశాఖ గర్జన కార్యక్రమం పై విరుచుకు పడిన పవన్ కళ్యాణ్ విశాఖలో గర్జన దేనికి అంటూ ప్రశ్నించారు. విశాఖ ఆసుపత్రులలో మరణించిన వారి మృతదేహాలను తరలించడానికి వాహనాలు కూడా సమకూర్చనందుకా.. ? కన్నుమూసిన బిడ్డను భుజాన వేసుకుని బైక్ పై తీసుకెళ్ళేలా చేసినందుకా? అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా? అంటూ పవన్ కళ్యాణ్ ఒక వార్తా పత్రికలో ప్రచురితమైన వార్త పేపర్ క్లిప్పింగ్ ను పోస్ట్ చేసి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దేనికి గర్జన అంటూ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశ్నించారు.

గర్జనను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్ లు
నిన్నటికి నిన్న వరుస ట్వీట్లు సంధించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని అనేక సమస్యలను ఏకరువు పెట్టారు. దేనికి గర్జనలు అంటూ ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ రోడ్లు వేయనందుకా? చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుకా? సీపీఎస్ మీద మాట మార్చినందుకా? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందుకా? పోలీసులకు టిఏ, డిఏలు ఇవ్వనందుకా? అంటూ మండిపడ్డారు. అందమైన అరకు పేరును కాస్తా గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసినందుకా? గంజాయి కేసుల్లో రాష్ట్రాన్ని ఒకటో స్థానంలో నిలిపినందుకా? అని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ చేయనందుకా? జగన్ విదేశీ విద్య స్కీమ్ కు పేరుమార్చి.. నిధులు ఇవ్వనందుకా అంటూ నిలదీశారు.

రాష్ట్రంలో సమస్యలను ప్రస్తావిస్తూ జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్
అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నందుకా? విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లతో మరుగు దొడ్లఫోటోలు తీయిస్తున్నందుకా? మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసినందుకా? అంటూ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచినందుకా? ప్రజలు కోరిన మీదట ఛార్జీలు పెంచామని చెప్పుకున్నందుకా? రైతులను, కౌలు రైతులను మోసం చేసినందుకా? అని ప్రశ్నించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సమస్యలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ తాజాగా మరోమారు విశాఖలో గర్జన దేనికీ అంటూ గర్జించారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications