పవన్ కల్యాణ్ లో వచ్చిన మార్పు దేనికి సంకేతం?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వైఖరిని స్పష్టం చేస్తున్నారు. మొన్నటి వరకు వ్యతిరేక ఓటును చీలనివ్వనని, ఏకీకృతం చేస్తానని ప్రకటించిన పవన్ ఇప్పుడు వాటి ఊసే ఎత్తడంలేదు. ప్రజలంతా ఆలోచించుకొని ఓటు వేయాలని, జనసేనను గెలిపించాలా? లేదా? అనేది మీరు నిర్ణయించుకోండంటూ ప్రజల భుజస్కంధాలపై పెద్ద బాధ్యతను అప్పగించారు. ఒక్కసారిగా పవన్‌లో ఇటువంటి మార్పు కలగడానికి కారణమేంటనే పనిలో రాజకీయ విశ్లేషకులున్నారు.
బాదుడే బాదుడు, మహానాడు, మినీ మహానాడుకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసిన తెలుగుదేశం పార్టీ సాధ్యమైనంతవరకు ఎన్నికలకు ఒంటరిగా వెళ్దామని సమాయత్తమవుతోంది. పొత్తుల గురించి జనసేనాని ముఖ్యమంత్రి పదవిని కోరడం లేదా పదవిని పంచుకోవడం అనే విషయాలను ప్రస్తావిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ ఆలోచనలో పడింది. తన అవసరాన్ని, తన బలహీనతను పవన్ కల్యాణ్ రాజకీయ అవసరాలకు వినియోగించుకోవాలనే యోచనలో ఉండటం పార్టీ అధినేతను ఆలోచనలో పడవేసింది.

మంత్రివర్గంలో పదవులు కేటాయించడంవరకు పర్వాలేదుకానీ ఒక్కసారిగా ముఖ్యమంత్రి పదవిని కోరడాన్ని మాత్రం టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. వ్యతిరేక ఓటు చీలనివ్వననేదానికి అర్థమేంటని ప్రశ్నిస్తోంది. రాజకీయంగా జనసేనాని కూడా నెమ్మది నెమ్మదిగా రాటుదేలుతున్నారనేదానికి ఇది సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ తన రాజకీయవైఖరిని స్పష్టం చేస్తుండటంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.












Click it and Unblock the Notifications