• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జనసేన దారెటు..? ప్రజా క్షేత్రమా.. సినిమా రంగమా..? గబ్బర్ సింగ్ గురి దేనిమీద...?

|

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాలు ఒక్కోసారి కత్తిమీద సాములా పరిణమిస్తుంటాయి. కాలం కలిసి వస్తే అంతా సజావుగా సాగుతుంది. తప్పటడుగు పడితే మాత్రం కోలుకోవడానికి మాత్రం సమయం పడుతుంది. ఒక్కోసారి పార్టీని ఇతర పార్టీలో విలీనం చేసి బాద్యతలనుండి వైదొలగాలనే భావన కూడా వస్తుంది. తొలిసారి ఎన్నికలో ఓటమి పాలైనంత మాత్రాన నైరాశ్యానికి లోను కావాల్సిన అవసరం ఉండనే సత్యాన్ని కూడా రాజకీయాలు బోదిస్తుంటాయి. ఏపి లో జనసైన పార్టీకి అచ్చం ఇలాంటి సంఘటనలే ఎదురౌతున్నాయి. వచ్చే ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తారా..? లేక పార్టీని వదిలేసి సినిమాల వైపు మొగ్గు చూపిస్తారా ? అనే సందేహాలను పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏపిలో మూడో స్థానంలో ఉన్న జనసేనను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలా లీడ్ చేయబోతున్నారు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

జనసేనకు అగ్ని పరీక్ష..! రాబోవు ఐదేళ్లు పార్టీని నడపగలరా...?

జనసేనకు అగ్ని పరీక్ష..! రాబోవు ఐదేళ్లు పార్టీని నడపగలరా...?

తాజా ఎన్నికల్లో జనసేన పార్టీ బొక్కబోర్లా పడిన విషయం తెలిసిందే. దీంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ‌్ ఓటమికి గల కారణాలను విశ్లేశించుకుంటున్నారు. అయితే కమిటీలు వేస్తానని, పార్టీని పటిష్టం చేస్తానని గబ్బర్ సింగ్ హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్యలో అమెరికా టూర్ పెట్టుకున్నారు. ఇపుడు పవన్ కల్యాణ‌్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారన్న ఆవేదన పార్టీలో అభిమానులకు ఉంది. పవన్ కల్యాణ‌్ అయిదేళ్ల పాటు పార్టీని నడపాలి. తాను మళ్లీ సినిమాల జోలికి పోనని, పార్టీ కోసం పనిచేస్తానని గట్టిగా చెబుతున్నారు. అంటే ఇప్పటి నుంచి ఆయన ప్రజా క్షేత్రంలో ఉంటే వచ్చే అయిదేళ్ల నాటిని ఓ ఫోర్స్ గా మారవచ్చు అన్న నమ్మకం అయితే కార్యకర్తల్లో బలంగా నెలకొంది. దానికి అనుగుణంగా కాటమనాయుడు వ్యవహరించాల్సి కూడా ఉంది.

ఒక్క ఓటమితో నిరుత్సాహపడాల్సిన పనిలేదు..! దైర్యాన్ని నూరిపోస్తున్న కార్యకర్తలు..!!

ఒక్క ఓటమితో నిరుత్సాహపడాల్సిన పనిలేదు..! దైర్యాన్ని నూరిపోస్తున్న కార్యకర్తలు..!!

పవన్ కల్యాణ‌్ వైఖరి మీద పార్టీ నేతలకు విశ్వాసం ఉన్నా రాజకీయ విశ్లేషకులకు మాత్రం ఇంకా సందేహాలు ఉన్నాయి. పార్టీని నడిపించాలంటే ఆషామాషీ విషయం కాదు. అందులో ఒకసారి దారుణంగా ఓడిన పార్టీ మీద డబ్బులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు. నలభయ్యేళ్ల చరిత్ర ఉన్న టీడీపీ కూడా ఎలా పార్టీని అయిదేళ్ళు నడపాలా అని సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా పార్టీ పెట్టిన పవన్ కల్యాణ‌్ కి ఎన్నో సవాళ్లు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే టీడీపీతో పోలిస్తే ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ సినీ నటుడిగా గ్లామర్, రాజకీయంగా చూస్తే పవన్ వయసు యువకుడిగానే చెప్పొచ్చు.

పార్టీ మనుగడ కోసం శ్రమిస్తామంటున్న శ్రేణులు..! పవన్ అండదండలు చాలంటున్న క్యాడర్..!!

పార్టీ మనుగడ కోసం శ్రమిస్తామంటున్న శ్రేణులు..! పవన్ అండదండలు చాలంటున్న క్యాడర్..!!

ఏపీలో బలమైన సామాజిక వర్గం వెంట ఉండడం వంటివి ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. మైనస్ లను పక్కన పెట్టి ఈ ప్లస్ లను చూసుకునే ముందుకు సాగితే ఏపీలో జనసేన ఓ బలమైన శక్తిగా నిలుస్తుంది. నాయకుడు పార్టీని నడిపేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని భావించిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విరాళాల సేకరణకు నడుం బిగించారు. దాదాపుగా వంద కోట్ల రూపాయలను విరాళంగా సేకరించి పవన్ కళ్యాణ్ బర్త్ డే అయిన సెప్టెంబర్ 2 న ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆన్ లైన్ ద్వారా విరాళాల సేకరణ చేపడుతున్నారు.

కాపాడుకునే బాద్యత పవన్ దే..! వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం..!!

కాపాడుకునే బాద్యత పవన్ దే..! వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం..!!

తెలుగు రాష్ట్రాలతో పాటు, ప్రవాసంలో ఉన్న పవన్ కల్యాణ‌్ అభిమానులు తలచుకుంటే వంద కోట్ల రూపాయల మొత్తం వసూలు కావడం కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో ఇపుడు వైసీపీ బలంగా ఉంది. ఎంత కాదనుకున్నా టీడీపీయే ప్రత్యామ్నాయంగా ఉంటుంది. బీజేపీ కేంద్రంలో ఉన్న బలంతో హడావుడి చేస్తోంది. వీటిని తట్టుకుని జనంలో గుర్తింపు తెచ్చుకోవాలంటే మాత్రం పవన్ కల్యాణ్ కచ్చితమైన బలమైన వైఖరి తీసుకుని నిరంతరం జనంలో ఉండేలా పక్కా కార్యాచరణతో ముందుకు రావాల్సిందే. అయితే బీజేపీ, టీడీపీని తట్టుకుని నిలవడం అంత సులువుకాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఐనప్పటికి ప్రజలు ఎప్పుడు, ఏ పార్టీకి జై కొడతారో తెలియదు కాబట్టి గబ్బర్ సింగ్ ప్రజల మద్య ఉండే ఫలితాలు అనుకూలంగా ఉంటాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Politics also presents the truth that there is a need for despair in the first election. Similar events are happening to the party that was born in AP. Will Pawan Kalyan lead the party effectively till the next election? Or leave the party and lean towards movies? Party workers are expressing doubts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more