దేశంలో మాంసాహారం తినే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణా ఏ స్థానంలో ఉన్నాయంటే

భారతదేశంలో అనేక రకాల జాతులు, మతాలు, కులాలవారు నివసిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రాంతాలను బట్టి ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కొన్నిచోట్ల ప్రజలు శాఖాహారాన్ని తింటే మరికొన్ని చోట్ల మాంసాహారాన్ని తింటారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా మాంసాహారాన్ని ఇష్టంగానే తింటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే మాంసాహారాన్ని చాలా ప్రత్యేక సందర్భాలలో తింటూ ఉంటారు.

మాంసాహారులపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
నాన్ వెజ్ లేకుండా భోజనం చేయడం భోజనం చేసినట్టే ఉండదు అన్న భావనను వ్యక్తం చేస్తూ ఉంటారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మన దేశంలో మాంసాహారులు ఎంతమంది శాకాహారులు ఎంతమంది అన్న వివరాలను వెల్లడించింది. 2015 -16 సంవత్సరంలోని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సుమారు 78 శాతం మహిళలు 70 శాతం మంది పురుషులు వారానికి ఒకసారి చేపలు, పౌల్ట్రీ లేదా మాంసాన్ని తీసుకుంటారని నిర్ధారించింది.

Where do AP and Telangana rank among the meat-eating states in the country

మాంసాహారం తినే రాష్ట్రాలలో టాప్లో ఈ రాష్ట్రం
దీనికి తోడు మాంసాహారం ఎక్కువగా వినియోగించే రాష్ట్రాలను సర్వే పేర్కొంది. ఈ సర్వే జాబితాలో మాంసాహారం ఎక్కువ తినే రాష్ట్రాలలో నాగాలాండ్ అగ్రస్థానంలో ఉంది. నాగాలాండ్ లో నివసించేవారు దాదాపు 99.8% మంది మాంసాహారులు. ఇక తర్వాత రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది. పశ్చిమ బెంగాల్లో 99.3% మంది నాన్ వెజ్ ఎక్కువగా తినే వారు ఉన్నారు. ఆ తర్వాత మూడవ స్థానంలో కేరళ రాష్ట్రం ఉంది.

మాంసాహారం తినే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణా ఎన్నో స్థానంలో ఉన్నాయంటే
కేరళ రాష్ట్రంలో 99.1 శాతం మంది మాంసాహారాన్ని తింటారు. ఇక తెలుగు రాష్ట్రాలలో మాంసాహారాన్ని ఎక్కువగానే తింటారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మాంసాహారం తినే రాష్ట్రాలలో నాలుగవ స్థానంలో ఉంది .ఆంధ్రప్రదేశ్లో 98.25 శాతం మంది మాంసాహారులు ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మాంసాహారం తినే వారి సంఖ్య తక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 98.8 శాతం మంది పురుషులు 98.6% మంది మహిళలు మాంసాహారులు.

మాంసాహారం తినే రాష్ట్రాల్లో తమిళనాడు స్థానం ఇదే
ఇక తమిళనాడు రాష్ట్రం 97.65 శాతం మంది మాంసాహారులతో ఆరవ స్థానంలో ఉంది. భారతదేశంలో దక్షిణ ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే, పంజాబ్లో చికెన్, గుడ్లు తినేవారిని నిష్పత్తి తక్కువగా ఉంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు దేశంలో మాంసాహారం తినే రాష్ట్రాలలో 4,5 స్థానాలలో ఉన్నాయి. ఇక దక్షిణ భారత దేశంలో మాంసాహారం తక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం ఇక్కడ నివాసితులలో 81.2 శాతం మంది మాంసాహారాన్ని తింటారు .

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+