దర్శిలో ఓడినా ఆమేనా ఎమ్మెల్యే? ప్రభుత్వాస్పత్రిలో హల్ చల్..
ఏపీలో కూటమి సర్కార్ 164 సీట్లతో తాజాగా ఎన్నికల్ని క్లీన్ స్వీప్ చేసేసినా దర్శి నియోజకవర్గంలో మాత్రం వైసీపీ చేతిలో ఓటమిపాలైంది. ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసిన గొట్టిపాటి లక్ష్మి ఓడిపోయారు. అయితే పేరుకే ఓటమి, ఆమే అక్కడ ఎమ్మెల్యే అన్నట్లుగా హంగామా చేస్తున్నారు. దర్శి ప్రభుత్వ ఆస్పత్రిలో తాజాగా ఆమె చేసిన హంగామా ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మేనకోడలు అయిన గొట్టిపాటి లక్ష్మికి టీడీపీ అధిష్టానం తొలిసారి దర్శిలో టికెట్ ఇచ్చి నిలబెట్టింది. అప్పటికే డాక్టర్ గా మంచి పేరున్న ఆమె ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులొడ్డారు. అయినా గెలవలేకపోయారు. దీంతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే అయ్యారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దర్శిలో గొట్టిపాటి లక్ష్మి అనధికార ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారు.

తాజాగా గొట్టిపాటి లక్ష్మి దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. స్వతహాగా డాక్టర్ అయిన లక్ష్మి ఆస్పత్రి సూపరిండెంట్ కుర్చీలో కూర్చొని ఆస్పత్రి పనితీరుపై సమీక్షలు చేసేశారు. అక్కడ ఉన్న అధికారులు, సిబ్బందికి ఆదేశాలు కూడా ఇచ్చేశారు. అయితే ఇదంతా ఏ హోదాలా ఆమె చేశారని మాత్రం అడగొద్దు. అదంతే అని సరిపెట్టుకోవాల్సిందే. దర్శి ప్రభుత్వ ఆస్పత్రిలో లక్ష్మి హల్ చల్ కు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

ఇప్పటికే ఓవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని సీఎం చంద్రబాబు నిన్న కేబినెట్ భేటీలో సైతం గగ్గోలు పెడుతుంటే మరోవైపు ఇలా స్థానిక నేతలు ఎలాంటి అధికార హోదా లేకపోయినా ఇలా ఆస్పత్రులకు వెళ్లి సమీక్షలు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications