బాబు తర్వాత నెంబర్ 2 ఎవరు?: ఆసక్తికర చర్చ, ఎందుకు?

టిడిపిలో చంద్రబాబునాయుడు తర్వాత ఎవరనే చర్చ తెరమీదికి వచ్చింది.అయితే రాజకీయపరంగా ఈ చర్చ రాలేదు.

Recommended Video

    After ChandraBabu Naidu Who Is the key person In TDP

    అమరావతి: టిడిపిలో చంద్రబాబునాయుడు తర్వాత ఎవరనే చర్చ తెరమీదికి వచ్చింది.అయితే రాజకీయపరంగా ఈ చర్చ రాలేదు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కొందరు ,పారిశ్రామిక వేత్తలు ఇటీవల కాలంలో ఈ విషయమై ఏపీ రాష్ట్రానికి చెందిన అధికారులతో చంద్రబాబునాయుడు పార్టీలో కీలకమైన నేత ఎవరనే విషయాన్ని తెలుసుకొని సంతృప్తి చెందారు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా 2014లో విడిపోయింది. అయితే ఏపీ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశాల్లో విస్తృతంగా పర్యటించారు..

    ఇటీవల కాలంలో చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనను పూర్తి చేసి అమరావతికి వచ్చారు. అయితే ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు ఆసక్తిని చూపారు. అయితే అదే సమయంలో కొన్ని సందేహలను అధికారుల వద్ద నివృత్తి చేసుకొన్నారు.

     పార్టీలో చంద్రబాబు తర్వాతి స్థానం ఎవరిది?

    పార్టీలో చంద్రబాబు తర్వాతి స్థానం ఎవరిది?

    టిడిపిలో చంద్రబాబునాయుడు తర్వాత స్థానం ఎవరదనే విషయమై కొందరు పెట్టుబడిదారులకు అనుమానం వచ్చింది. ఈ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు ఏపీ అధికారులతో చర్చించారు.దుబాయ్ పారిశ్రామికవేత్తల నుంచి వాట్సాప్‌లో చిత్రమైన ప్రశ్నలు వచ్చాయి.రాష్ట్రంలో రాజకీయ స్ధిరత్వం ఉంటుందా? లేదా? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబే కీలకమా? బాబు తర్వాతి స్థానం ఎవరిది? ప్రభుత్వ నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇలాంటి సందేహలను వాట్సాప్‌లో సదరు పారిశ్రామికవేత్తలు పంపారు. ఈ ప్రశ్నలకు అధికారులు వాట్సాప్‌లో సమాధానాలు పంపారు.

    దుబాయ్ అధికారులకు సమాధానం

    దుబాయ్ అధికారులకు సమాధానం


    తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారనీ, ఎన్‌టీఆర్ తర్వాత ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని అధికారులు పారిశ్రామికవేత్తలకు సమాధానమిచ్చారు. సంస్ధగత ఎన్నికల ద్వారా చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకొంటారని అధికారులు చెప్పారు. అధికారులు పంపిన సమాధానాలతో దుబాయ్‌కు చెందిన పెట్టుబడిదారులు సంతృప్తి చెందారని సమాచారం.

     దుబాయ్‌లో పెట్టుబడుల కోసం బాబు పర్యటన

    దుబాయ్‌లో పెట్టుబడుల కోసం బాబు పర్యటన

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లండన్, అమెరికా తదితర ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు పదిరోజుల క్రితమే పెట్టుబడుల కోసం వెళ్ళివచ్చారు. దుబాయ్‌లో ప్రముఖమైన 25 మంది పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. దుబాయ్‌లోని భారత దౌత్యవేత్త ఏర్పాటుచేసిన డిన్నర్ మీట్‌కు బిగ్‌షాట్ లే వచ్చారు. అందరూ చంద్రబాబుతో చేయి కలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు చంద్రబాబునాయుడు వివరించారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే సౌకర్యాలను కూడ పారిశ్రామికవేత్తలకు బాబు వివరించారు.

     బాబు పవర్‌పాయింట్ ప్రజేంటేషన్

    బాబు పవర్‌పాయింట్ ప్రజేంటేషన్

    ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం ఇచ్చే రాయితీలను, సరళీకృత అనుమతుల విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ ప్రజెంటేషన్‌ని అందరూ ఆసక్తిగా చూశారు. ఇంతవరకూ బాగానే ఉంది. తమ తరఫున ఒక బృందం త్వరలోనే ఏపీకి వస్తుందని ఈ సందర్భంగా ఆ పారిశ్రామికవేత్తలు హామీ ఇచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+