Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్సార్ ఎవరి సొంతం? వైఎస్ జగన్ వైఎస్ షర్మిల వారసత్వపోరుతో బిగ్ డిబేట్!!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి నేడు. వైయస్సార్ జయంతి సందర్భంగా ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను తమ రాజకీయం కోసం వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.

వైఎస్సార్ పై జగన్, షర్మిల వారసత్వ పోరు
వైయస్సార్ జయంతి వేడుకల సాక్షిగా వైయస్సార్ కొడుకు, కూతురు మధ్య రాజకీయ వారసత్వం పైన జరుగుతున్న యుద్ధం వైయస్ఆర్ సతీమణి విజయమ్మ ఆవేదనకు కారణం అవుతుంది. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా పరిస్థితి మారింది . వైయస్సార్ వారసత్వం తమదంటే తమదంటూ షర్మిల, జగన్ నేడు రాజకీయ రచ్చకు తెర తీశారు.

Who owns YSR Big Debate with YS Jagan and YS Sharmila fight for political Inheritance

జగన్ కు వైఎస్సార్ ను దూరం చేసే షర్మిల వ్యూహం,. జగన్ ప్రతివ్యూహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైయస్సార్ ను దూరం చేసి, కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేలా ఎైయస్ షర్మిల చేసిన వ్యూహం, దీనిని తిప్పికొట్టేందుకు జగన్ వేసిన రాజకీయమంత్రాంగం ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాలలో వైఎస్ఆర్ చూపిన మార్గంలో నడుస్తానని జగన్ చెబుతుంటే, తనకు తన తండ్రి ఆదర్శమని, కాంగ్రెస్ పార్టీ కోసం తన తండ్రి ఎంతో చేశారని, ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోదని వైయస్ షర్మిల చెబుతున్నారు.

విజయవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు..
ఇక వైయస్సార్ రాజకీయ వారసత్వం జగన్ ది కాదని చెప్పే వ్యూహంలో భాగంగా వైయస్ షర్మిల వైఎస్ఆర్ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించేందుకు పలురాష్ట్రాల ముఖ్య నేతలను సైతం ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ లను ఈ వేడుకకు ఆహ్వానించిన షర్మిల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లకు కూడా హాజరు కావాలని కోరారు.

షర్మిలకు చెక్ పెట్టేలా జగన్ ప్లాన్
ఈ వ్యూహం ద్వారా వైయస్సార్ ఇమేజ్ తన రాజకీయం కోసం వాడుకోవాలని, జగన్ కు చెక్ పెట్టాలని షర్మిల భావిస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో వైయస్సార్ జయంతి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను చేయాలని సూచించారు. తన తండ్రే తనకు స్ఫూర్తి అంటూ ఎమోషనల్ అయ్యారు.

వైఎస్సార్ ఎవరి సొంతం.. జగన్ కా.. షర్మిలకా..
మొత్తంగా వైఎస్సార్ జయంతిని అన్నా చెల్లెళ్ళు ఇద్దరు పోటీపడి రాజకీయంగా వాడుకోనున్నారు. వైయస్సార్ ఇమేజ్ ను హైజాక్ చేసే పనిలో అన్నా చెల్లెలు వైయస్ జగన్ షర్మిల వేసిన ఎత్తుగడలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇంతకీ వైఎస్సార్ ఇమేజ్ వైసీపీ అధినేత జగన్ కు సొంతమా.. లేక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలకు సొంతమా అన్నది చర్చనీయాంశంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+