అవిశ్వాసానికి వేళాయే!: ఛైర్మన్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీలు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. ముఖ్యంగా శాసనమండలి వేదికగా వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్‌కు మధ్య పోరు తీవ్ర రూపం దాల్చుతుంది. ఛైర్మన్ తీరుపై ఇప్పటికి గుర్రుగా ఉన్న ఆరు మంది.. త్వరగా తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారు. అయితే ఛైర్మన్ పై పోరాటన్ని మరింత పెంచాలని భావించిన వీరంతా చివరి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రస్తుతం ఒక వింతైన రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. వైసీపీని వీడి బయటకు వచ్చిన ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, జకియా ఖానమ్‌, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌.. తమ పదవులకు రాజీనామా చేసినప్పటికీ, వాటిని మండలి ఛైర్మన్ ఇంతవరకు ఆమోదించకపోవడం ఇప్పుడు పెను వివాదానికి దారితీస్తోంది. ఛైర్మన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈ సభ్యులు, ఏకంగా ఆయనపైనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Why 6 Resigned YSRCP MLCs are Moving No-Confidence Motion Against AP Council Chairman Moshen Raju

రాజీనామాలు ఉన్నా.. ఆమోదముద్ర పడలేదా?

వైసీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కొద్దిరోజుల క్రితమే తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం వ్యక్తిగతంగా కలిసి లేఖలు సమర్పించినా, ఛైర్మన్ వాటిని పెండింగ్‌లో ఉంచడంపై సదరు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను సాంకేతికంగా పదవుల్లో కొనసాగించడం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని వారు అనుమానిస్తున్నారు.

అవిశ్వాసానికి దారితీస్తున్న కారణాలు..

రాజీనామాలను వెంటనే ఆమోదించకుండా కాలయాపన చేయడం తమ హక్కులను కాలరాయడమేనని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. ఛైర్మన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ప్రభుత్వ ఒత్తిడి మేరకే పని చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలపాలని నిర్ణయించారు. ప్రస్తుతం మండలిలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కావాల్సిన కనీస సభ్యుల మద్దతు తమకు ఉందని, వైసీపీ నుండి బయటకు వచ్చిన వారితో పాటు ఇతర మద్దతుదారులను కలుపుకుంటే ఛైర్మన్‌ను ఇరకాటంలో పెట్టవచ్చని వీరు యోచిస్తున్నారు.

రాజకీయ వ్యూహం ఏంటి?

సాధారణంగా సభాపతి లేదా ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టడం అనేది ఒక తీవ్రమైన నిర్ణయం. రాజీనామాలు ఆమోదించకపోతే, కనీసం ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా సభలో చర్చ జరిపి, ఛైర్మన్ వైఖరిని ప్రజల ముందు ఎండగట్టాలని ఈ ఎనిమిది మంది సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరగడం ఖాయం.

మండలిలో బలాబలాలు..

శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో గవర్నర్ కోటా కలుపుకుని వైసీపీ సభ్యులు 35. టీడీపీకి 10 మంది, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు ఉన్నారు. వైసీపీ బలంగా 35 మంది ఉండగా ఆరుగురు రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 29కి పడిపోయినట్లు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+