'కేశవ రెడ్డి' లింక్స్, టిడిపిలోకి ఆదినారాయణ!: ఏ ఆలోచనతో జగన్‌కు ఝలక్?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయన రాకను టిడిపి నేత రామసుబ్బా రెడ్డి తీవ్రంగా వ్యతిరేకస్తున్నారు. రామసుబ్బా రెడ్డి వ్యతిరేకిస్తున్నందునే ఆయన చేరిక ఆలస్యమవుతోంది.
ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు గత నాలుగు నెలలుగా వస్తున్నాయి. ముఖ్యంగా... కేశవ రెడ్డి విద్యా సంస్థల చైర్మన్ కేశవ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాతనే ఆదినారాయణ తెలుగుదేశం పార్టీలో చేరుతానని చెబుతున్నారని అంటున్నారు.
కేశవ రెడ్డి విద్యా సంస్థల కుంభకోణం నేపథ్యంలోనే ఆదినారాయణ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని రామసుబ్బా రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు ఆయన ఏ ఆలోచనతో టిడిపిలోకి వస్తున్నారో చెప్పాలని నిలదీస్తున్నారు.

నిబంధనలు, చట్టాలకు విరుద్ధంగా తల్లిదండ్రులు, ప్రయివేటు వ్యక్తుల నుంచి కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించి, వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని అందిన ఫిర్యాదుల నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు కేశవ రెడ్డి సంస్థల పైన దర్యాఫ్తు చేస్తున్నారు.
ఈ కేసు నేపథ్యంలోనే ఆదినారాయణ రెడ్డి టిడిపిలోకి వస్తున్నారనేది కొందరి వాదన. ఆదినారాయణ రెడ్డికి కేశవ రెడ్డి విద్యా సంస్థల చైర్మన్ కేశవ రెడ్డి వియ్యంకుడు అవుతాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని టిడిపి నేత రామసుబ్బా రెడ్డి ప్రస్తావిస్తున్నారు.
కాగా, గతంలో ఓ సందర్భంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ... తన వియ్యంకుడు కేశవ రెడ్డి చేసింది పొరపాటేనని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications