'పవన్ కళ్యాణ్ పైన అంత అసహనం ఎందుకు, అది కుటుంబ సమస్యనా?'
హైదరాబాద్: ప్రత్యేక హోదా గురించి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలదీస్తుంటే బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఎందుకు ఎదురు దాడి చేస్తున్నాయని ప్రత్యేక హోదా ఉద్యమకారులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా, నటుడు శివాజీ కూడా పవన్‌ను టార్గెట్ చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ హోదా గురించి నిలదీస్తే వీరంతా ఎందుకు అసహనానికి గురవుతున్నారని ప్రశ్నించారు. హోదా గురించి బీజేపీ, టీడీపీలను ఎందుకు అడగవద్దని, ఇదేమైనా మీ ఇంటి లేదా కుటుంబ సమస్యనా అని ధ్వజమెత్తారు. పవన్ లాంటి వారు హోదా కోసం పోరాడి తీరాలన్నారు.

హోదా సాధనా సమితి నేత చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. హోదా కోసం జల చేశామని, రక్తదాన శిబిరాలు నిర్వహించామన్నారు. జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించామని, ఇంకా ఏం చేయమంటారని ప్రశ్నించారు.
ఏపీకి హోదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం ఏపీకి ప్రకటించింది ప్రత్యేక సాయం కాదని, దిక్కుమాలిన, పనికిరాని ప్యాకేజీ అని దుయ్యబట్టారు. ఇటువంటి ప్యాకేజీలు వద్దన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతున్నారన్నారు. హోదా కంటే ప్యాకేజీ వల్లనే ఎక్కువ లాభాలు అని చెప్పడం సరికాదన్నారు. హోదా లేకుంటే ప్యాకేజీ అవసరం ఏమిటన్నారు.












Click it and Unblock the Notifications