Chandrababu Oath Ceremony: అమరావతి కాదని కేసరపల్లి ఎందుకంటే ?

ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత చంద్రబాబు నేతృత్వంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. అయితే ఇందుకు అమరావతి వేదికగా చంద్రబాబు ఈసారి తన ప్రమాణస్వీకారం చేస్తారని అంతా భావించారు. ముఖ్యంగా ప్రధాని మోడీ గతంలో అమరావతికి శంఖుస్ధాపన చేసిన స్ధలంలో చంద్రబాబు ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు, క్యాడర్ భారీగా ప్రచారం కూడా చేశారు. కానీ చివరికి బాబు మాత్రం గన్నవరం ఎయిర్ పోర్టు పక్కనున్న కేసరపల్లి ఐటీ పార్క్ ను ఎంచుకున్నారు.

దీంతో చంద్రబాబు తాను ఇంతగా ఫోకస్ పెడుతున్న అమరావతిని కాదని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఎందుకు ప్రమాణస్వీకారం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు కారణాలను తెలుసుకుంటే విషయం అర్ధమైంది. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ, అమిత్ షా, రజనీకాంత్ తో పాటు పలువురు వీవీఐపీలు హాజరవుతున్నారు. వీరంతా విజయవాడ ట్రాఫిక్ ను దాటి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి అమరావతికి చేరుకోవడం కష్టం.

why Chandrababu opt kesarapalli IT park than Amaravati for swearing ceremony

అలాగని అమరావతిలోనే ప్రత్యేక హెలికాఫ్టర్లను ల్యాండ్ చేయించే పరిస్దితి లేదు. ఇప్పటికే అమరావతి ముళ్ల కంపలతో నిండిపోయి ఉంది. ఇప్పటికిప్పుడు దాన్ని క్లీన్ చేయించినా వీవీఐపీలను అక్కడ ల్యాండ్ చేయించడం సురక్షితం కాదని నిఘా వర్గాలు తేల్చేశాయి. దీంతో వీవీఐపీల రాకను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తన ప్రమాణస్వీకారానికి గతంలో తాను ఐటీ కంపెనీలు పెట్టేందుకు ప్రయత్నించిన కేసరపల్లి ప్రాంతాన్నే ఎంచుకున్నారు. దీని వల్ల భారీ సంఖ్యలో ప్రజలను ఇక్కడికి ఆహ్వానించలేని పరిస్ధితి రావడం మరో ఇబ్బందిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+