వైనాట్ 200.. జగన్ డబుల్ సెంచరీ నినాదం వెనుక ధీమా ఇదేనా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర మొదలుపెట్టి ప్రజాక్షేత్రంలోకి జోరుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ప్రసంగాల్లో కొత్తగా వినిపిస్తున్న నినాదం ఇప్పుడు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కొత్త రాగం అందుకున్న జగన్
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు, షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎక్కడ బహిరంగ సభ పెట్టినా, నేతలతో మాట్లాడినా మన లక్ష్యం మొత్తం 175 నియోజకవర్గాలు అంటూ చెప్పుకొచ్చారు. వై నాట్ 175 అనే మాటను పదేపదే ప్రస్తావించారు. అయితే తాజాగా ఆయన కొత్త రాగం అందుకున్నారు. వై నాట్ 200 అంటూ మేమంతా సిద్ధం సభలలో డబుల్ సెంచరీ కొడతానంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Why not 200 Is this the reason behind YS Jagan double century slogan

జగన్ టార్గెట్ ఇప్పుడు 200
ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో ఈ రెండు వందలు ఎక్కడివి అని ప్రజలు చర్చిస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు కలిపి మొత్తం 200 నియోజకవర్గాలు. ఇక ఇదే విషయాన్ని జగన్ జనాలకు చెబుతున్నారు. డబుల్ సెంచరీ కొట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని, పేదల పక్షాన పని చేసే తనను గెలిపించడానికి మీరంతా సిద్ధమా అంటూ పదేపదే జనాలను ప్రశ్నిస్తున్నారు.

జగన్ ప్రజాక్షేత్రంలో భారీ స్పందన
మేమంతా సిద్ధం సభలలో ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్లినా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి డబల్ సెంచరీ కొడతాను అంటూ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని ఆయన తన వ్యాఖ్యలతో స్పష్టం చేస్తున్నారని చెబుతున్నారు.

డబుల్ సెంచరీ నినాదంతో జనంలోకి
ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని జగన్ కు పేద ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని, పెత్తందారులకు పేద ప్రజలకు జరుగుతున్న యుద్ధమని పేదల పక్షాన తానున్నానని జగన్ చెబుతున్నారు. కడప నుంచి మదనపల్లె వరకు ఎక్కడ బహిరంగ సభ నిర్వహించినా జగన్ డబల్ సెంచరీ నినాదంతో ఏపీలో హ్యాట్రిక్ సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

జగన్ ధీమాకు కారణం ఇదే
ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న జగన్ కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు, తాను అందించిన సంక్షేమ ఫలాలు, ఇప్పటికే అనేక సర్వేలు ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం వెరసి జగన్ ధీమా పెరిగినట్టుగా ఈ నేపథ్యంలోనే వై నాట్ 200 అంటూ జగన్ డబుల్ సెంచరీ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+