రైళ్ళలో స్లీపర్ కోచ్ లలో బెడ్ షీట్స్, దిండ్లు తెలుపు రంగువే ఇస్తారు..ఎందుకు?
భారతీయ రైల్వేలు దేశ ప్రగతికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు రైల్వే తన కనెక్టివిటీ తో విశేషమైన సేవలను అందిస్తోంది. ప్రతిరోజు లక్షల సంఖ్యలో ప్రజలు రైళ్లలో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు స్లీపర్ కోచ్ లను, ఏసీ కోచ్ లను బుక్ చేసుకుంటారు.
తెల్లని బెడ్ షీట్స్, దిండ్లు ఇవ్వటం వెనుక రైల్వే కృషి
అయితే ఈ స్లీపర్ కోచ్ లు, ఏసీ కోచ్ లలో ప్రయాణం చేసే వారికి తెల్లని బెడ్ షీట్లు, తెల్లని పిల్లో కవర్స్ తో ఉన్న దిండ్లు ఇస్తారు. రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులకు తళ తళా మెరిసే ఈ తెల్లని బెడ్ షీట్లు, దిండ్లు ఇవ్వడం వంటి సేవల వెనుక రైల్వే చేసే విశేషమైన కృషి ఉంది.

ఒకసారి వినియోగం తర్వాత బెడ్ షీట్లు, పిల్లో కవర్స్ వాషింగ్
తళ తళా మెరిసేలా రైల్వే అందించే ఈ బెడ్ షీట్లు, దిండ్లకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం. రైళ్లల్లో ఉపయోగించే బెడ్ షీట్ లు. పిల్లో కవర్స్ ప్రయాణికుల ఒకసారి వినియోగం తర్వాత తప్పనిసరిగా వాటిని ఉతుకుతారు. ప్రయాణికులకు తెల్లని పరిశుభ్రమైన బెడ్ షీట్లను ఇస్తారు.
121 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వాషింగ్
అయితే ఈ తెల్లని బెడ్ షీట్లు, పిల్లో కవర్స్ వాషింగ్ లో 121 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి బాయిలర్లలో వేసి 30 నిమిషాల పాటు ఆవిరికి లోబడి మొత్తం క్రిమిరహితంగా మారేదాకా ఉంచుతారు. ఆపై వీటికి బ్లీచ్ వేసి తెల్లగా మెరిసేలా చేస్తారు. అయితే రైళ్లలో ఇచ్చే బెడ్ షీట్లను తెల్లవాటిని ఉపయోగించడం వెనుక ఒక ఆసక్తికర కారణం కూడా ఉంది.
రైళ్ళలో రంగుల బెడ్ షీట్స్ ఎందుకు వాడరు?
వివిధ రకాల రంగులు ఉన్న బెడ్ షీట్లను ఉపయోగిస్తే అవి ఆవిరి బాయిలర్లలో 121 డిగ్రీల సెల్సియస్ మీద 30 నిమిషాల పాటు ఆవిరికి లోబడి ఉన్నప్పుడు వాటిలో ఉండే రంగులు పోయే ప్రమాదం ఉంటుంది. ఇక దీంతో ఒకదాని రంగు మరొక బెడ్ షీట్ కు అంటుకుంటుంది. రంగు రంగుల బెడ్ షీట్లను ఉపయోగిస్తే వాటిని వాష్ చేసేటప్పుడు దేనికదే ప్రత్యేకంగా వాష్ చేయవలసి ఉంటుంది.
తెలుపు రంగు బెడ్ షీట్స్ వినియోగం ఇందుకే
అదే తెలుపు రంగు బెడ్ షీట్లు అయితే అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడమే కాకుండా ఫ్యాబ్రిక్ రంగు పోయే అవకాశం ఉండదు. తెల్లటి బెడ్ షీట్లను ఇవ్వడం ద్వారా ప్రయాణికులకు కూడా రైల్వే శుభ్రత పైన గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే రైళ్ళలో ప్రయాణం చేసే స్లీపర్ క్లాస్, ఏసీ కోచ్ ప్రయాణికులకు తెలుపు రంగు బెడ్ షీట్లను, తెల్లటి పిల్లో కవర్స్ తో శుభ్రంగా ఉన్న దిండ్లను ఇస్తారు.












Click it and Unblock the Notifications