ప్రియుడితో ఏకాంతంగా భార్య, చూసిన భర్తను కలిసి చంపేశారు

హైదరాబాద్: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నిందితురాలిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నల్గొండ జిల్లా ఆరూరుకు చెందిన ఐలయ్య అలియాస్ అనిల్, లక్ష్మీ దంపతులు. వీరికి 16 ఏళ్ల క్రితం వివాహమైంది. ఓ బాబు, పాప ఉన్నారు.

ఏడేళ్ల క్రితం నగరానికి వచ్చి ఉంటున్నారు. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న లక్ష్మీ తల్లి కూడా వీరి వద్దే ఉంటోంది. అనిల్ కారు డ్రైవర్. స్థానికంగా సంక్షేమ సంఘం కార్యదర్శిగా ఉంటున్నాడు. అనిల్ బంధువు సహదేవ్ దగ్గరలోని కాలనీలో ఉంటున్నాడు. ఫోటో స్టూడియో నడుపుతున్నాడు.

బంధుత్వాన్ని అడ్డు పెట్టుకొని సహదేవ్ తరుచూ వీరి ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో లక్ష్మీతో వివాహేతర సంబంధం కుదిరింది. విషయం తెలుసుకున్న భర్త అనిల్ తరుచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో అనిల్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు.

 Wife kills husband

ఈ నెల 24వ తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో సహదేవ్ ఆమెతో ఏకాంతంగా ఉండగా అనిల్ ఇంటికి వచ్చాడు. వారిద్దరు కలిసి ఉండటాన్ని గుర్తించిన అనిల్ వారిపై మండిపడ్డాడు. దీంతో వారు అనిల్‌ను చంపేందుకు యత్నించారు. సహదేవ్ ఓ నల్లని చున్నీ తీసుకొని గొంతుకు ఉరి బిగించాడు. లక్ష్మీ రోకలి తీసుకొని భర్త చాతి పైన, మర్మాంగాల పైన కొట్టింది.

దీంతో భర్త మృతి చెందాడు. సహదేవ్ పరారయ్యాడు. విధుల నుండి ఇంటికి వచ్చిన లక్ష్మీ తల్లి రోదిస్తుండటంతో విషయం స్థానికులకు తెలిసింది. పోలీసులు సమాచారం అందుకొని సంఘటన స్థలానికి వచ్చారు. లక్ష్మీ తనకు ఏమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేసింది. పారిపోయిన సహదేవ్‌ను పోలీసులు అర్ధరాత్రిలోగా అరెస్టు చేశారు. విచారణలో నిందితులు తప్పును ఒప్పుకున్నారు. వారిని శనివారం రిమాండుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+