Amaravati: అమరావతికి రూ.15 వేల కోట్లు ఖాయమేనా? వరల్డ్ బ్యాంక్ గ్యారంటీ..!

ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణసాయం ప్రపంచబ్యాంక్ నుంచి అందించేందుకు గ్యారంటీ ఇస్తామని ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది జరిగిన నెల రోజుల్లోపే ప్రపంచ బ్యాంక్ బృందం తాజాగా అమరావతి రాజధానికి వచ్చింది. రెండు రోజుల పాటు రాజధానిలో నిర్మాణాలను పరిశీలించిన వరల్డ్ బ్యాంక్ టీమ్ చివరిగా సీఎం చంద్రబాబుతో భేటీ అయి ఆయన విజన్ ఏంటో తెలుసుకుంది. ఈ భేటీలో వరల్డ్ బ్యాంక్ టీమ్ కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నలుగురు సభ్యుల వరల్డ్ బ్యాంక్ టీమ్ అమరావతిలో పర్యటించి భవనాల తాజా పరిస్ధితి తెలుసుకున్నాక చంద్రబాబుతో భేటీ అయింది. ఇందులో 2050 నాటికి అమరావతి జనాభా 35 లక్షలకు చేరుకుంటుందని, వీరికి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.15 వేల కోట్లను రుణంగా ఇవ్వాలని చంద్రబాబు కోరారు. రాజధానిలో 20 శాతాన్ని పార్కులు, పచ్చదనంతో గ్రీన్‌ ఏరియాగా మార్చుతామని, అమరావతిలోని ప్రతి ఒక్కరూ కాలినడకన పార్కులకు చేరుకునే స్థాయిలో వీటిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ, రోడ్ల కనెక్టివిటీ, మంచినీరు, ట్రంక్‌ ఇన్‌ఫ్రాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. వీటి కోసం తొలి విడతగా రూ.15 వేల కోట్లు కోరారు.

will Amaravati get rs 15000 cr soon from world bank

అయితే గతంలో రూ.3500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమై చివరి నిమిషంలో స్ధానికుల నుంచి అందిన ఫిర్యాదులతో ఆగిపోయిన ప్రపంచబ్యాంక్.. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వద్దనడంతో ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకుంది. ఇప్పుడు పరిస్ధితులు ఎలా ఉన్నాయనే అంశంపై చంద్రబాబును ప్రపంచబ్యాంక్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో పరిస్ధితులు మారినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ తీసుకునేందుకు మరోసారి అమరావతికి వస్తామని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు చంద్రబాబుకు తెలిపారు.

అయితే ఓవైపు కేంద్రం గ్యారంటీ ఉండటం, మరోవైపు చంద్రబాబు అమరావతి అభివృద్ధి ప్రణాళికల్ని ముందుంచిన నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ టీమ్ తదుపరి భేటీలో రూ.15 వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే సాధ్యమైనంత త్వరలో అమరావతిలో మౌలిక సదుపాయాల్పనతో పాటు ఇతర పనులు ప్రారంభం కాబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+