వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెడ్ జోన్లా ? హాట్ స్పాట్లా ?... ఏప్రిల్ 20 తర్వాత మినహాయింపులపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 133 ప్రాంతాలను ప్రభుత్వం రెడ్ జోన్లుగా ఎంపిక చేసింది. ఆయా ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 20 తర్వాత వీటిలో మాత్రమే లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగించాలని భావించిన ప్రభుత్వానికి ఇప్పుడు తాజాగా కేంద్రం రాష్ట్రంలోని 11 జిల్లాలను హాట్ స్పాట్లలో చేర్చడం ఇబ్బందికరంగా మారింది. దీంతో లాక్ డౌన్ మినహాయింపులు ఎక్కడ ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

ఏపీలో లాక్ డౌన్ పరిస్ధితి....

ఏపీలో లాక్ డౌన్ పరిస్ధితి....

ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర్రవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కొన్ని జిల్లాలో కరోనా వైరస్ కేసులు అధికంగాను, మరికొన్ని చోట్ల అత్యల్పంగానూ, రెండు జిల్లాల్లో అసలు కేసులే లేని పరిస్ధితి ఉంది. అయితే రాష్ట్రం మొత్తంలో కరోనా వైరస్ అధికంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ పరిమితులు సడలించాలని ప్రభుత్వం భావించింది. ఇదే ఆలోచనను సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ప్రధాని మోడీతో పంచుకున్నారు.

 కేంద్రం హాట్ స్పాట్ల ప్రకటన...

కేంద్రం హాట్ స్పాట్ల ప్రకటన...

కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న జిల్లాలను హాట్ స్పాట్లుగా ప్రకటించింది. ఇందులో ఏపీలోని 11 జిల్లాలు కూడా వచ్చేశాయి. కేవలం ఇప్పటివరకూ ఒక్క కేసూ నమోదు కాని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రమే నాన్ హాట్ స్పాట్లుగా ఉన్నాయి. దీంతో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చేందుకు ఈ రెండు జిల్లాల్లోనే వీలు కలుగుతోంది. మిగతా జిల్లాల్లో గ్రామీణ పరిశ్రమలు, క్వారీలు, భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నా అది ఎంత వరకూ సాధ్యమన్నది తేలడం లేదు.

నాలుగు రోజులే గడువు..

నాలుగు రోజులే గడువు..

కేంద్రం హాట్ స్పాట్ల ప్రకటనతో తాము గుర్తించిన రెడ్ జోన్లకే లాక్ డౌన్ ఆంక్షలను పరిమితం చేసే పరిస్ధితి లేదు. దీంతో మొత్తం కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. అటు కేంద్రాన్ని నిందించలేక, వాస్తవ పరిస్ధితిని అనుసరించి లాక్ డౌన్ కొనసాగించలేక ఏపీ సర్కారుకు చుక్కలు కనిపిస్తున్నాయి. కేంద్రం లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చేందుకు పెట్టుకున్న గడువు మరో నాలుగు రోజులు ఉంది. ఏప్రిల్ 20 తర్వాత పరిమిత మినహాయింపులు అమలు చేయాల్సి ఉంది. ఆ లోపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ నిర్ణయం ప్రకటించాల్సి ఉండటంతో ప్రభుత్వ పెద్దలు అధికారులతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు.

Recommended Video

Fake News Buster : 06 ప్రభుత్వానికి మత పెద్ద హెచ్చరిక.. ఆ వీడియో భారత్‌లో జరిగింది కాదు

English summary
andhra pradesh govt wants to continue lock down in red zones only after april 20th. but centre announces 11 districts in ap as covid 19 hotspots. so, now ap govt has to rethink on their previous decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X