పొత్తులతో చంద్రబాబు పుట్టి ముంచుతాడా? తెలుగుతమ్ముళ్ళ అంతర్మథనం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఏపీలో మళ్లీ అధికారంలోకి రావాలని వైసిపి ప్రయత్నం చేస్తుంటే, ఎలాగైనా ఈసారి వైసీపీని గద్దె దించాలని తెలుగుదేశం పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలోనే టిడిపి ఈసారి ఎన్నికలకు పొత్తులతో వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ఏపీలో జనసేన తో కలిసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తులతో ఎన్నికలకు వెళుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న వారు టికెట్లు కోల్పోవలసి వస్తోంది. ఇక ఈ పరిణామం తెలుగు తమ్ముళ్లకు ఏ మాత్రం రుచించని అంశం కాగా, ఇక తాజాగా బీజేపీతో కూడా టిడిపి పొత్తులకు ఓకే అన్నట్టుగా తెలుస్తుంది.

Will Chandrababu drowned tdp aspirants with janasena bjp alliances? tension in tdp aspirants

ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటన , హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావటం వంటి అంశాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇక ఈ క్రమంలో పొత్తులలో భాగంగా బిజెపికి స్థానాలు కేటాయించవలసి వస్తే మళ్లీ తెలుగు తమ్ముళ్లు తమ టికెట్లు పోతాయేమో అన్న బెంగతో ఉన్నారని తెలుస్తుంది. అయితే పొత్తులో భాగంగా జనసేనకి , బిజెపికి ఎన్ని సీట్లు త్యాగం చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.

పొత్తులలో భాగంగా జనసేన బీజేపీలకు 40 స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమైనట్టు సమాచారం. అయితే వారు 55 నుండి 60 స్థానాలు కోరుకోవటంతో దీంతో ఆయా స్థానాల‌పై ఆశ‌లు పెట్టుకున్న నాయ‌కులు, ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన నాయ‌కులు, చంద్ర‌బాబు స‌భ‌ల‌కు ఖ‌ర్చులు చేసిన నాయ‌కులు తమ పరిస్థితి ఏమిటని ఆందోళనలో ఉన్నారు. త‌మ‌కు టికెట్ ఇస్తారో.. ఇవ్వ‌రో అంటూ.. ఏమి జరుగుతుందని ఆరా తీస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు జనసేనతో పాటు బీజేపీతో పొత్తుకు రెడీ కావటం తెలుగు తమ్ముళ్ళకు నచ్చటం లేదు. ఇప్పుడు బీజేపీ నేతలకు కూడా టికెట్లు కేటాయించాల్సిన పరిస్థితితో ఏం చేయాలో అర్థం కాక తమ టికెట్ విషయంలో తెలుగు తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. బాబు మాత్రం సొంత పార్టీ నేతల అంతర్మధనాన్ని పట్టించుకోకుండా పొత్తులపైనే ఆశలు పెట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+