ఈసారి ఆ బలహీనత అధిగమించబోతున్న చంద్రబాబు ? దసరాకు తీపి కబురు !
ఏపీలో విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓ బలహీనత ఉంది. అది నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం. ముఖ్యంగా పార్టీ టికెట్ల ఎంపిక అంటే చంద్రబాబు చేసే కసరత్తు అంతా ఇంతా కాదు. చివరికి అంత కసరత్తు చేసి కూడా గత ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా 23 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో గతంలో చేసిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసేందుకు చంద్రబాబు ఈసారి వ్యూహం మారుస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన విపక్షమైన టీడీపీతో కలిసి ఈసారి పోటీ చేసేందుకు ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఓ ఎత్తయితే టీడీపీలో అంతర్గతంగా టికెట్ల కోసం ఎప్పుడూ ఉండే పోటీ మరో ఎత్తు. ఈ రెండు అంశాల మధ్య సమన్వయం చేస్తూ టికెట్లు ప్రకటించడం ఈసారి చంద్రబాబుకు అంత సులువు కాదు.

మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 25 సీట్లకు పైగా చంద్రబాబు ఇన్ ఛార్జ్ లను ప్రకటించాల్సి ఉంది. ఈ నాలుగేళ్లు ఎలా నెట్టుకొచ్చినా మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో వీటిపై క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం టీడీపీకి ఉంది. దీంతో ఈసారి ఎన్నికలకు ఇన్ ఛార్జ్ లకు బదులుగా నేరుగా అభ్యర్ధుల రూపంలోనే వారిని ప్రకటించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇకపై ఇన్ ఛార్జ్ ల వ్యవస్ధ ఉండబోదని లోకేష్ పాదయాత్రలోనే ప్రకటించేశారు. దీంతో ఇకపై ప్రకటించాల్సిన ఇన్ చార్జ్ ల స్ధానంలో అభ్యర్ధులనే చంద్రబాబు ఫైనల్ చేసేస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ గతంలో అన్ని సీట్లు గెల్చుకున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీకి అనుకూలంగా కనిపిస్తున్న పరిస్దితుల్ని సొమ్ముచేసుకునేందుకు వీలుగా మూడు సీట్లకు అభ్యర్ధుల్ని ఫైనల్ చేసేసిన చంద్రబాబు.. ఆత్మకూరు నుంచి ఆనం, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి, నెల్లూరు సిటీ నుంచి నారాయణను ఎంపిక చేశారు. ఇదే క్రమంలో మిగతా సీట్లపైనా కసరత్తు పూర్తి చేసి దసరాకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పోటీ చేసే సీట్లలో అభ్యర్ధుల్ని చంద్రబాబు అధికారికంగానే ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో జనసేన, బీజేపీకి కేటాయించే స్ధానాలపైనా చంద్రబాబు క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications