Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ మార్చ్ లో గంటా పాల్గొంటారా..! ఇరకాటంలో మాజీ మంత్రి: ఏం చేయబోతున్నారు..!

ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వైఖరికి నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ కు నిర్ణయించారు. ఈ నిరసనలో కలిసి రావాలని అన్ని పార్టీలను ఆహ్వానించారు. అయితే, తొలి నుండి పవన్ తో ఉన్న వామపక్షాలతో సహా కాంగ్రెస్..బీజేపీ సైతం తాము పాల్గొనటం లేదని తేల్చి చెప్పాయి. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఏ పార్టీ అయినా ప్రజా సమస్యల పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మద్దతిస్తామని ప్రకటించారు.

పవన్ నిర్వహించే మార్చ్ లో పాల్గొనేందుకు ముగ్గురు మాజీ మంత్రులను చంద్రబాబు ఎంపిక చేసారు. అందులో గంటా శ్రీనివాస రావు ఒకరు. అయితే, ఇప్పుడు అదే గంటాకు సంకటంగా మారింది. రాజకీయంగా ఇరకాటంలో పడేసింది. మరి..గంటా ఈ మార్చ్ లో అసలు పాల్గొంటారా..తప్పించుకుంటారా..

will Ganta srinivasa rao participate in Pawan Kalyan long march..?

పవన్ వర్సెస్ గంటా అన్నట్లుగా..
పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కు టీడీపీ నుండి చంద్రబాబు ముగ్గురు మాజీ మంత్రుల పేర్లు ఖరారు చేసారు. అందులో గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు ఉన్నారు. అయితే, ఇప్పుడు అందరూ గంటా మీదే ఫోకస్ చేసారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసి గెలిచిన గంటా ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం తో మంత్రి పదవి పొందారు. ఇక, 2014లో టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ప్రజారాజ్యం సమయం నుండి నేటి వరకు చిరంజీవితో మాత్రం గంటా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.

కానీ, పవన్ తో మాత్రం అంత సఖ్యత లేదనే విషయం తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో స్పష్టమైంది. పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో గంటాకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక దశలో గంటాను ఓడించాలని పిలుపునిచ్చారు. గంటా జనసేనలోకి వచ్చేందుకు ప్రయత్నించారని..పవన్ అంగీకరించలేదని అప్పట్లో ప్రచారం సాగింది. ఇక, గంటా సైతం పవన్ వ్యాఖ్యల మీద గట్టిగానే స్పందించారు. ధవళేశ్వరం బ్యారేజీ పైన భారీ కవాతు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన నాడు మంత్రిగా ఉన్న గంటా విమర్శలు చేసారు. ఆ కవాతు ద్వారా ఆయన ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు.

లాంగ్ మార్చ్ కు గంటా హాజరవుతారా..
పవన్ కళ్యాణ్ తో దాదాపు ఢీ అంటే ఢీ అన్న గంటా ఇప్పుడు విశాఖ నగరంలో జనసేన నిర్వహించే నిరసన మార్చ్ లో టీడీపీ ప్రతినిధిగా పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజారాజ్యంలో కలిసి పోటీ చేసి గెలిచి.. ఆ తరువాత 2014లోనూ టీడీపీలో కలిసి పని చేసి గెలిచిన గంటా..అవంతి ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్ధులుగా మారారు. ఒకరి పైన మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇదే సమయం లో పవన్ తో సైతం గంటా సంబంధాలు దెబ్బ తిన్నాయి.

గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన కన్నబాబు..అవంతి శ్రీనివాస్ కు పవన్ ను రాజకీయంగా టార్గెట్ చేసే బాధ్యతలు ముఖ్యమంత్రి అప్పగించారు. ఇక తాను ఓడిపోవాలని పిలుపునిచ్చిన పవన్ కు మద్దతుగా ఇప్పుడు గంటా మార్చ్ లో పాల్గొంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు హాజరవ్వాలా లేదా అనే సంశయంలో గంటా సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా పార్టీ మారుతారంటూ కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.

ఇప్పుడు కారణాలు ఏవైనా మార్చ్ కు హాజరు కాకుంటే చంద్రబాబు ఆదేశాలు భే ఖాతర్ చేసారనే ప్రచరమూ సాగే అవకాశము ఉంది. అదే సమయంలో గంటా మనస్పూర్తిగా మార్చ్ లో పాల్గొనలేని పరిస్థితి. దీంతో..ఇప్పటికే బీజేపీ..వామపక్షాలు..కాంగ్రెస్ పార్టీలు పవన్ కళ్యాణ్ మార్చ్ లో పాల్గొన లేమని తేల్చి చెప్పాయి. ఇక, టీడీపీ ముగ్గురుని పంపాలని నిర్ణయించింది. అందులో గంటా హాజరువుతారా లేదా అనేది మాత్రం సందేహంగానే కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+