బెజవాడ వేదికగా మరో ఎన్టీఆర్ వేడుక-జూనియర్ ను ఈసారైనా పిలుస్తారా ?
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సినీ జీవితం ప్రారంభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 14న విజయవాడలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహిచేందుకు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన వివరాలను కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్ ఇవాళ వెల్లడించారు. వజ్రోత్సవాలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.
విజయవాడలో వజ్రోత్సవాలు నిర్వహించాక.. ఇదే తరహాలో విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, కర్ణాటకలలో కూడా ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించబోతున్నారు. అలాగే హైదరాబాద్‌లో త్వరలో ఎన్టీఆర్ పేరుతో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ వెల్లడించారు. అయితే వీటి సంగతి ఎలా ఉన్నా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరుకాబోతున్న ఈ కార్యక్రమానికి ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

గతంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలతో పాటు పలు కార్యక్రమాలకు జూనియర్ కు ఆహ్వానం అందకపోవడమో, లేక అందినా ఆయన రాకపోవడమో జరిగింది. దీంతో జూనియర్ ను నందమూరి కుటుంబం దూరం పెడుతోందన్న విమర్శలు వినిపించాయి. ఎన్టీఆర్ పోలికలు, హావభావాలతో కనిపించే జూనియర్ ను ఓన్ చేసుకునేందుకు నందమూరి కుటుంబం, అలాగే నారా కుటుంబం కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు. అయితే ఈసారి మాత్రం ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన వేడుక కాబట్టి చిత్ర పరిశ్రమ నుంచి పిలిపే ఇతర హీరోలతో పాటు ఎన్టీఆర్ ను ఆహ్వానించే అవకాశాలూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications