కేసీఆర్ కు ఏపీ ఓట్లు వద్దా ? ఇటు వైజాగ్ స్టీల్ బిడ్-అటు హరీష్ ఓట్ల బదిలీ పిలుపు..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై రెండు రోజులుగా తెలంగాణ మంత్రి హరీష్ రావు విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో వైసీపీ మంత్రులు కూడా ఆయనకు ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు. అంతకు ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున సింగరేణి మైన్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొంటామని లీకులు ఇచ్చింది. అన్నట్లుగానే సింగరేణి అధికారుల్ని వైజాగ్ స్టీల్ కు పంపి సాధ్యాసాధ్యాల పరిశీలన చేయిస్తోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు తెలంగాణలో సెటిలర్లకు ఇచ్చిన పిలుపు చర్చనీయాంశమైంది.
ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో సెటిలైన వారు స్ధానికులేనని, వారంతా తమ ఓట్లు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేయించుకోవాలని మంత్రి హరీష్ రావు నిన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేయడం ద్వారా ఆంధ్రుల ఓట్ల కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో హరీష్ రావు వ్యాఖ్యలు మంటరేపాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అదే సమయంలో హరీష్ వ్యాఖ్యలను బట్టి చూస్తే కేసీఆర్ కు ఏపీలో ఓట్లు అవసరం లేదా అన్న చర్చ మొదలైంది.

ఓవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేయడం ద్వారా ఏపీలో ఘనంగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందన్న సంకేతాల్ని బీఆర్ఎస్ ఇవ్వగలిగింది. ఏపీలో రాజకీయ పార్టీలు వైజాగ్ స్టీల్ పై చేతులెత్తేసిన వేళ పొరుగు రాష్ట్ర పార్టీ అయిన బీఆర్ఎస్.. తమ ప్రభుత్వ సంస్ధ అయిన సింగరేణి అధికారుల్ని వైజాగ్ పంపడం సానుకూల సంకేతాలు పంపింది.
అదే సమయంలో హరీష్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే వైజాగ్ స్టీల్ పై హంగామా చేస్తోందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే వైసీపీ నేతలు బీఆర్ఎస్ వైజాగ్ స్టీల్ లో వాటాల కొనుగోలు మినహా స్వాధీనం చేసుకోవడం లేదని తేల్చి చెప్పేశారు.












Click it and Unblock the Notifications