అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్‌నైనా కలుస్తా: హిందూపురం కోసం పోరాటం ఆగదన్న బాలకృష్ణ, రాజీనామాకు ఓకే

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజకీయ వేడి రాజుకుంది. పలు జిల్లాల్లో జిల్లా కేంద్రం కోసం నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం జిల్లా కేంద్రంగా ఉండాలనే ఉద్యమానికి మద్దతు పలకడంతోపాటు పోరాటాన్ని ఉధృతం చేశారు.

వైఎస్ జగన్‌ను కలుస్తానంటూ బాలకృష్ణ

వైఎస్ జగన్‌ను కలుస్తానంటూ బాలకృష్ణ

శనివారం అఖిలపక్ష నేతలతో కలిసి అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన బాలకృష్ణ.. అక్కడే కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అవసరమైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తామన్నారు. సత్యసాయి జిల్లాకు తాము వ్యతిరేకం కాదని, అయితే, తమ డిమాండ్ మాత్రం నెరవేర్చాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన తర్వాత.. వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని, ఆ తర్వాతే తమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని బాలకృష్ణ తెలిపారు.

హిందూపురం కోసం ఎంతదూరమైనా వెళ్తామంటూ బాలకృష్ణ

హిందూపురం కోసం ఎంతదూరమైనా వెళ్తామంటూ బాలకృష్ణ

పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేయడం ప్రజలకు ఇష్టం లేదన్నారు. హిందూపురంలోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో తాము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, ఎంతదూరమైనా వెళుతామన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికే.. జిల్లాల వివాదాన్ని తీసుకొచ్చారంటూ విమర్శించారు. ఒక చిన్న మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారన్నారు.

రాజీనామాకు కట్టుబడి ఉన్నానన్న బాలకృష్ణ

రాజీనామాకు కట్టుబడి ఉన్నానన్న బాలకృష్ణ

అంతేగాక, తన రాజీనామా విషయంలో కట్టుబడి ఉన్నానని బాలకృష్ణ స్పష్టం చేశారు. రాజీనామా చేస్తే.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ విసిరిన సవాలుకు బాలకృష్ణ ఓకే చెప్పారు. ప్రస్తుతం ఏపీలో అందరూ ఉద్యమిస్తున్నారని, ప్రజల దృష్టి మళ్లించడానికి జిల్లాల ప్రకటన చేశారని విమర్శించారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టారో అందరికీ తెలిసిందేనని అన్నారు. నిజమైన ప్రేమతో ప్రభుత్వం వ్యవహరించడం లేదని, గత ప్రభుత్వం చేసిన వాటిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంపై ఏమీ మాట్లాడటం లేదన్నారు.

హిందూపురంను జిల్లా కేంద్రం చేయాల్సిందేనంటూ బాలకృష్ణ

హిందూపురంను జిల్లా కేంద్రం చేయాల్సిందేనంటూ బాలకృష్ణ

హిందూపురం జిల్లా కేంద్రం చేయాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏమి జరుగుతోంది? ప్రజల మనోభావాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాలకృష్ణ అన్నారు. మంత్రులకు అధికారాలు లేవని, అడ్మినిస్ట్రేటివ్ విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తోందన్నారు. సినిమా టికెట్ల వివాదంపై బాలకృష్ణ స్పందిస్తూ.. ఇప్పటికే సినీ పెద్దలకు తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు తెలిపారు.

జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రేమతో కాదు..: బాలకృష్ణ

జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రేమతో కాదు..: బాలకృష్ణ

హిందూపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని, ఎక్కడ ఉన్నా తన పోరాటాన్ని కొనసాగిస్తానని బాలకృష్ణ తేల్చి చెప్పారు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వం దిగిపోతుందోనని ఎదురుచూస్తున్నారని బాలకృష్ణ అన్నారు. ఎన్టీ రామారావు మీద ప్రేమతో ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయలేదని.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ బాలకృష్ణ అన్నారు. అంత ప్రేమ ఉంటే అన్నా కాంటీన్లను ఎందుకు తొలగిస్తారంటూ ప్రశ్నించారు. కాగా, బాలకృష్ణ శుక్రవారం హిందూపురంలో మౌనదీక్ష సైతం చేపట్టిన విషయం తెలిసిందే.

English summary
Will meet AP CM YS Jagan for Hindupur: Nandamuri Balakrishna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X