జగన్ వదిలేసిన చోటే లోకేష్ మొదలు ? యువగళం టైటిల్, టార్గెట్ అదే ! పకడ్బందీ ట్రాప్ ?

ఏపీలో మరో పాదయాత్రకు రంగం సిద్దమవుతోంది. టీడీపీ యువనేత నారా లోకేష్.. వచ్చే ఏడాది ఆరంభంలో యువ గళం పేరుతో పాదయాత్ర చేపట్టబోతున్నారు. 4000 కిలోమీటర్లను 400 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపట్టబోతున్నారు. ముఖ్యంగా యువత లక్ష్యంగా ఈ పాదయాత్రను రూపొందించుకున్నారు. పాదయాత్ర పొడుగునా యువత, యువ సెలబ్రిటీలు, విద్యార్ధులను కలుపుకుంటూ ఈ యాత్ర చేయబోతున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్ గతంలో వదిలేసిన ఓ కీలక అంశం వద్ద నుంచే ఈ యాత్ర ప్రారంభం కానుంది.

 నారా లోకేష్ యువగళం

నారా లోకేష్ యువగళం

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న యువతను ఆకట్టుకునేలా, వారి ఆలోచనలను ప్రతిబింబించేలా, ముఖ్యంగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వారికి తెలియజేసి అవగాహన కల్పించేలా నారా లోకేష్ యువగళం యాత్రకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా యువతను భారీగా భాగస్వాముల్ని చేయబోతున్నారు. యాత్రకు పెట్టిన యువగళం పేరుకు తగినట్లుగానే వారి గళాన్ని రాష్ట్రానికి వినిపించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. గతంలో అన్ని వర్గాల ప్రజల కోసం వైఎస్, చంద్రబాబు, జగన్ పాదయాత్రలు చేస్తే ఈసారి లోకేష్ మాత్రం కేవలం యువతను టార్గెట్ చేశారు. దీని వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి.

 జగన్ యువ భేరీలు

జగన్ యువ భేరీలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి పలు కారణాలు దోహదం చేశాయి. అందులో గత టీడీపీ ప్రభుత్వంలో విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన యువభేరి కార్యక్రమాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఇందులో విద్యార్ధుల్ని ఓ చోట పోగేసి విభజన హామీలకు సంబంధించి అవగాహన పెంచారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా వంటివి సాధించుకుంటే రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందని పదే పదే చెప్పారు. దీంతో విద్యార్ధులతో పాటు వారి తల్లితండ్రులు కూడా దీన్ని నమ్మారు. చివరికి ఇదో టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది.

 యువభేరీల బాటలోనే యువగళం

యువభేరీల బాటలోనే యువగళం

అప్పట్లో జగన్ యువభేరీలను రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇండోర్ ఆడిటోరియాల్లో నిర్వహించేవారు. ముఖ్యంగా యూనివర్శిటీలు, కాలేజీల్ని ఎంపిక చేసుకునే వారు. అక్కడికి భారీ ఎత్తున విద్యార్ధుల్ని, యువతను తరలించే వారు. అక్కడ వారికి విభజన హామీల గురించి వివరిస్తూ, వాటిని సాధించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసే వారు. ఇప్పుడు లోకేష్ మాత్రం ఇలా ఇండోర్ ఆడిటోరియాల్లో కాకుండా బహిరంగంగానే పాదయాత్రలోనే యువత,విద్యార్ధుల్ని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తద్వారా వారిలో విభజన హామీల్ని సాధించడంలో జగన్ సర్కార్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ వాటిని సాధించేందుకు ఈసారి టీడీపీకి ఓటేయమని కోరబోతున్నారు.

 జగన్ వదిలేసిన చోటే మొదలుపెడుతున్న లోకేష్ ?

జగన్ వదిలేసిన చోటే మొదలుపెడుతున్న లోకేష్ ?

గతంలో యువభేరీల నిర్వహణతో విభజన సమస్యల సాధన అవసరాన్ని జగన్ విద్యార్ధులు, యువతకు గుర్తుచేశారు. తద్వారా వాటిని సాధించుకోవాలంటే ఈసారి వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇమ్మని కోరారు. వారు కూడా దాన్ని నమ్మి ఓటేశారు. కానీ ఇప్పటికీ వాటిలో ఏ ఒక్కటీ సాధించలేదు. ఇప్పుడు లోకేష్ అదే విషయాన్ని విద్యార్ధులకు వివరించాలని నిర్ణయించారు. అదే యువతను కలిసి వైసీపీ విఫలమైంది కాబట్టి టీడీపీకి అవకాశమిస్తే రాష్ట్రానికి విభజన హామీల్ని సాధిస్తామని చెప్పబోతున్నారు. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇవే హామీలు నెరవేర్చని చంద్రబాబు, లోకేష్.. ఈసారి మాత్రం ఎలా సాధిస్తారని వారి నుంచి ఓ ప్రశ్న ఎదురయ్యే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. దానికి వీరు సమాధానం వెతుక్కోవాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+