బొత్సపై ఏసీబీకి టీడీపీ ఫిర్యాదు-టార్గెట్టా ? బెదిరింపా ?

ఏపీలో తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడం ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో, అంతకు ముందు వైసీపీ మాజీ మంత్రులు చేసిన తప్పులను అధికారంలోకి రాబోతున్న టీడీపీ టార్గెట్ చేస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా టీచర్ల బదిలీలు చేపట్టడం ద్వారా బొత్స అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

వైసీపీ సర్కార్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ అక్రమంగా టీచర్ల బదిలీలు చేపట్టారని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో వర్ల రామయ్య ఆరోపించారు. ఒక్కో టీచర్ నుంచి అక్రమ బదిలీ కోసం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. దీనిపై అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు చేపట్టాలని ఆయన ఏసీబీ అధికారుల్ని కోరారు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.

will tdp s complaint against botsa satyanaraya is part of targeting or warning

అయితే ఇంత హడావిడిగా చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే, ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఏసీబీకి బొత్స సత్యనారాయణపై చర్యలు కోరుతూ వర్ల రామయ్య చేసిన ఫిర్యాదు వెనుక ఏముందనే చర్చ జరుగుతోంది. ఈ ఫిర్యాదు ఉద్దేశం బొత్స సత్యనారాయణకు బెదిరింపా లేక టార్గెట్ లో భాగమా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే వైసీపీ ఓటమి తర్వాత బొత్స జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అదే నిజమైనా బొత్స ముందరి కాళ్లకు బంధాలు వేయడమే లక్ష్యంగా టీడీపీ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+