వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో స్థానిక సమరానికి హైకోర్టు బ్రేక్ వేస్తుందా ? గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? తీర్పు రిజర్వ్

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార వైసీపీ సిద్ధం అవుతుంది. ఇక ప్రతిపక్ష పార్టీలు సైతం స్థానిక సంస్థల ఎన్నికల కసరత్హు మొదలు పెట్టాయి . ఇక ఈ నేపధ్యంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించడంపై కోర్టును ఆశ్రయించారు కొందరు. ఇక దీనిపై విచారణ కొనసాగించిన హైకోర్టు ధర్మాసనం లోకల్ ఎన్నికల నిర్వహణను వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ పిటీషన్లపై వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఎప్పటి వరకు తీర్పు వెల్లడిస్తుందో అర్ధం కాని పరిస్థితి .

ఏపీ మంత్రులకు కొత్త టాస్క్ అప్పగించిన సీఎం ..టెన్షన్ లో మంత్రులుఏపీ మంత్రులకు కొత్త టాస్క్ అప్పగించిన సీఎం ..టెన్షన్ లో మంత్రులు

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల శాతం 50కి మించిందని పిటీషన్

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల శాతం 50కి మించిందని పిటీషన్

ఇక అసలు విషయానికి వస్తే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదని, కానీ ఏపీలో ప్రస్తుతం రిజర్వేషన్లు 50 శాతాన్ని దాటేశాయని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు . గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రాతిపదికన చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదు . ఇక ఈ నేపధ్యంలోనే ఈ పిటిషన్లపై గతంలోనే హైకోర్టు ధర్మాసనం విచారణ పూర్తి చేసింది.

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు

ఇక నేడు ఏపీ హైకోర్టు ధర్మాసనం మరోసారి ఇరు వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది. గతంలో సుప్రీంకోర్టు కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జడ్జిమెంట్‌లో 50 శాతం కంటే రిజర్వేషన్లు మించకూడదని తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. అయితే వీరి వాదనతో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ విబేధించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చని హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు.

Recommended Video

AP Cabinet Decides To Hold Local Body Polls Before March 15| Oneindia Telugu
తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

ఇక ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం అన్ని పిటిషన్లపై విచారణ ముగిసిందని తెలిపి తీర్పును వెలువరించేందుకు మరింత లోతైన పరిశీలన అవసరమని భావించిన హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది . ఇక ఈ నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది . ఇది స్థానిక ఎన్నికలకు తహతహలాడుతున్న రాజకీయ పార్టీలకు ఒకింత షాకింగ్ అనే చెప్పాలి .

English summary
The YCP will be prepared for the election of local bodies in AP. Opposition parties have also begun election arrangements of local bodies. It is in this context that some people have resorted to court for over 50 per cent reservation in local bodies. The High Court, which continued its inquiry, appears to be postponing the conduct of local elections. The court reserved its verdict on the petitions. Until then the verdict reveals a meaningless situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X