వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లికి జగన్ హాజరుపై సస్పెన్స్ ? వస్తే ఓ తంటా..రాకపోతే..!

ఏపీలో సీఎం వైఎస్ జగన్ తన సోదరి, కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లికి వెళ్తారా లేదా ? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. వాస్తవానికి అంతా బావుంటే అసలు ఈ చర్చకు ప్రాధాన్యతే లేదు. అంతెందుకు అసలు చర్చే లేదు. కానీ జగన్, షర్మిల మధ్య గ్యాప్ కారణంగా ఇరువురూ తలోదిక్కుకు వెళ్లి పనిచేసుకుంటుండటం, గతంలోలా కలిసి కనిపించకపోవడం వంటి కారణాల నేపథ్యంలో వచ్చిన రాజారెడ్డి పెళ్లి వీరిని తిరిగి ఏకం చేయాల్సి ఉంది.

రెండేళ్లుగా అన్నతో విభేదించి తెలంగాణకు వెళ్లిపోయి అక్కడ వైఎస్సార్టీపీ పార్టీ పెట్టినా ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతిచ్చి అనంతరం ఆ పార్టీలో చేరిపోయిన వైఎస్ షర్మిల త్వరలో తన కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో కులాంతర వివాహం జరిపించబోతున్నారు. ఈ పెళ్లితో పాటు నిశ్చితార్ధానికి కూడా రావాలని పలువురిని ఆహ్వానిస్తున్నారు. తొలికార్డు తండ్రి సమాధి వద్ద పెట్టిన షర్మిల.. రెండోది అన్న జగన్ కు తీసుకెళ్లి ఇచ్చారు. దీనిపై ఆయనేమన్నారో తెలియదు.

will ys jagan attend ys sharmilas son rajareddys marriage?

అనంతరం తాజాగా వైఎస్ షర్మిల వరుసపెట్టి జగన్ కు ప్రత్యర్ధులుగా ఉన్న వారిని కలుస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వంటి వారు ఉన్నారు. అలాగే ఇప్పటికే జగన్ కు రాజకీయంగా బద్ధశత్రువైన నారా లోకేష్ కు క్రిస్మస్ గ్రీటింగ్స్, గిఫ్ట్ పంపిన షర్మిల.. ఇప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ ను పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
అది కూడా జరిగితే ఒకే వేదికపై వీరంతా కనిపించక తప్పదు. అలా జరుగుతుందా.. జరిగితే తర్వాత ఏం జరగబోతోందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టిన పార్టీలోకి వెళ్లిన షర్మిల.. ఇప్పుడు తన ప్రత్యర్ధులందరినీ పిలిచిన పెళ్లికి తాను కూడా వెళ్లి వాళ్లను కలవడం జగన్ కు ఇబ్బందికర పరిణామమే. దీంతో అసలు జగన్ ఈ పెళ్లికి హాజరవుతారా లేదా అన్న చర్చ జరుగుతోంది. రాజకీయాలు పక్కనపెట్టి తన సొంత మేనల్లుడి పెళ్లికి వెళ్తే మంచి సంకేతాలు వెళ్లడం ఖాయం. అలా కాదని దూరంగా ఉండిపోతే షర్మిలతో తన గ్యాప్ ను నిర్ధారించినట్లవుతుంది. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+