రాహుల్ పై జగన్ స్టాండ్ మళ్లీ మారిందా ? లేక మోడీపై అంచనాలు పెరిగాయా ?

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అంతకు ముందు కాంగ్రెస్ పై ఉన్న ఆగ్రహాన్ని పక్కనబెట్టి, ఆ పార్టీని క్షమించేశానని వైస్ జగన్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే పార్టీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తే వారికి మద్దతిస్తానంటూ పేర్కొన్నారు. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రత్యేక హోదాయే కాదు ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ పక్కనబెట్టేసింది. ఏపీకి చేయాల్సిందేమీ లేదనేలా ప్రవర్తిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.

ఓవైపు రాహుల్ గాంధీని పూర్తిగా టార్గెట్ చేసిన కేంద్రం.. ఎప్పుడో ఆయన చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో వెంటనే ఆయనపై లోక్ సభ సచివాలయం సాయంతో వేటు వేసింది. అంతే కాదు ఆయన బంగ్లాను సైతం వెంటనే ఖాళీ చేయించేసింది. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మిత్రపక్షాలతో పాటు ఇతర విపక్షాలన్నీ మండిపడ్డాయి. బీజేపీ తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఏపీలో జాతీయ పార్టీలతో తటస్ధ వైఖరి అవలంబిస్తున్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ మాత్రం మౌనం వహించింది.

will ys jagan change his stand again on rahul gandhi ? or expectations grown on pm modi ?

2019 ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీ.. తనను జైలుకు పంపిందన్న ఆగ్రహంతో ఉన్న వైఎస్ జగన్ ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో 2019 ఎన్నికల్లో జగన్ ప్రత్యర్ధి చంద్రబాబుతో జట్టు కట్టిన కాంగ్రెస్ పార్టీ చేదు ఫలితాలు చవి చూసింది. ఆ తర్వాత టీడీపీకి కూడా కాంగ్రెస్ దూరంగా ఉండిపోయింది. అదే సమయంలో 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను క్షమించేశానంటూ వ్యాఖ్యానించిన జగన్ మాత్రం ఆ పార్టీకి దగ్గరకావడమో లేక కనీసం తటస్ధ వైఖరి అవలంబించేందుకు కూడా వెనకాడుతున్నట్లు కనిపిస్తోంది.

2024 ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్.. ఈ క్రమంలో కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న ఎన్డీయేవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఎక్కడా ప్రస్తావించడం లేదు. అలాగే తన తండ్రి వైఎస్సార్ ఆత్మ అయిన కేవీపీ రామచంద్రరావు సైతం రాహుల్ కు మద్దతివ్వడం లేదని ప్రశ్నిస్తున్నప్పటికీ జగన్ మౌనంగానే ఉంటున్నారు. దీన్ని బట్టి చూస్తే మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే అంచనాల్లో జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+