Actress: బాలీవుడ్ నటి తెలీదు, వైసీపీ లీడర్ తో టచ్ లో లేము, కోర్టులో !!

బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ కారణంగా కొందరు ఐపీఎస్ అధికారులు తనను చిత్రహింసలకు గురి చేశారని బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ విజయవాడలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయ అధికారి ఎదుట ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు ఈ కేసులో కీలక సాక్షలు షాకింగ్ విషయాలు న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.

వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ కి ఇప్పుడు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ కు అనుకూలంగా కొందరు సాక్షులను పోలీసులు క్రియేట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ ఆరోపణలు నిజమే అని వెలుగులోకి వచ్చింది. కాదాంబరీ జెత్వానీ కేసులో కీలక సాక్షులైన నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు భరత్ కుమారులు విజయవాడలోని ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కోర్టులో న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.

Witnesses against YSRCP leader in Bollywood actress Kadambari Jethwani case

వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తండ్రి, జడ్పీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావుతో మాకు సన్నిహిత్యం ఉండేదని, అయితే ఆయన కుమారుడు, వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తో మాకు ఎలాంటి సంబంధాలు లేవని ఇద్దరు కీలక సాక్షులు న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ ను తాము చివరిసారిగా చూశామని, ఆ తర్వాత ఆయన్ను మేము ఎప్పుడూ కలవలేదని ఇద్దరు కీలక సాక్షులు న్యాయాధికారికి చెప్పారు.

జగ్గయ్యపేటలోని కుక్కల విద్యాసాగర్ చెందిన 5 ఎకరాల స్థలాన్నికి సంబంధించి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసిన బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ తన పేరిట బోగస్ పత్రాలు సృష్టించి మాకు విక్రయించింది అని మేము అప్పట్లో పోలీసులకు ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదని, ఆ భూమికి సంబంధించిన విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదని ఇద్దరు కీలక సాక్షులు న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.

Witnesses against YSRCP leader in Bollywood actress Kadambari Jethwani case

వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ కు, బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అనే విషయం మాకు తెలియదని ,10 సంవత్సరాల క్రితం విద్యాసాగర్ ను తాము కలిశామని, దాని తర్వాత ఇంతవరకు మేము ఆయన్ని కలవలేదని, కావాలనే ఈ కేసులో మమ్మల్ని ఇరికించి మా పరువు తీశారని, బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదని ఇద్దరు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు.

బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ మాకు ఎలాంటి భూమి అమ్మలేదని, ఈ కేసులో కీలక సాక్షులు అయిన నాగేశ్వరరాజు, భరత్ కుమార్ కోర్టులో న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ కేసులో కావాలనే ఈ ఇద్దరిని ఇరికించాలని ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్, కొందరు పోలీసు అధికారులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+