పరస్త్రీని చెరపట్టాడనే ఆరోపణలపై జైలుకెళ్లిన భర్త: పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య

అనంతపురం: తన స్నేహితురాలిని తన భర్త చెరపట్టడాని తన భర్తను పోలీసులు అరెస్టు చేయడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తాను మరణిస్తే తన పిల్లలు అనాథలవుతారనే ఉద్దేశంతో తన పిల్లలకు కూడా పాలలో వాజ్‌మోల్ కలిపి ఇంటి గదిలో పడుకోబెట్టి తాను అదే ఇంటిలో గవాక్షం దూలానికి చీరతో ఉరివేసుకుంది.

ఈ సంఘటన అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో జరిగింది. బండ్లపల్లికి చెందిన సోమన్నగారి మాధవీలత(25)కు ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లికి చెందిన కుమార్‌రెడ్డికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి బానుమతి(5), లోకేశ్వర్‌రెడ్డి(3) అనే పిల్లలు కలిగారు. వీరి కుటుంబం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు.

అయితే ఈ యేడాది అక్టోబర్ 16న కుమార్‌రెడ్డి మాధవీలత స్నేహితురాలిని ఆమె భర్త చెరపట్టాడనే ఆరోపణలు వచ్చాయి. ఆమె మరణించింది. దీంతో ఆమె హత్యతో భర్తకు సంబందం ఉందన్న అనుమానంతో పోలీసులు కుమార్‌రెడ్డిని నిందితునిగా కదిరి సబ్‌జైలుకి తరలించారు. దీంతో మాధవీలత తన ఇద్దరు పిల్లలతోసహా పుట్టిల్లైనటువంటి బండ్లపల్లికి వచ్చింది.

Woman along with her son commit suicide

తల్లిదండ్రులు రామాంజినేయులు, తల్లి నాగలక్ష్మి పనికి వెళ్ళి కుటుం బాన్ని పోషిస్తున్నారు. అన్న రామచంద్రారెడ్డి చదువుకుంటున్నాడు. ప్రతిరోజు మాదిరే మాధవీలత తల్లిదండ్రులను వేరుశనగ కట్టె కాయలు విడిపించడానికి గ్రామంలోని దొడ్లల్లో పనికి వెళ్ళారు. తీవ్ర మనస్తాపానికి గురైన మాధవీలత చిన్నారులకు ఇద్దరికి పాలల్లో వాజ్‌మోల్ కలిపి తాగించి పడు కోబెట్టింది.

ఇంటి తలుపులు బిగించి కుర్చీలో రగ్గులు ఎత్తుగా వేసుకుని ఇంటి దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూలి పనికి వెళ్ళిన తల్లి నాగలక్ష్మి అన్నం తినడానికి ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు మూసి ఉండడంతో తమ బందువులతో మాధవీలత గురించి అడిగి తెలుసుకుని ఇంటి లోపల గడియ ఉండడంతో గవాక్షం ద్వారా ఇంటిలోపలికి తొంగిచూడగా మాధవీలత వేలాడుతూ కనిపించింది.

ఇంటి తలుపులు బద్దలకొట్టి లోపలికి వెళ్ళి చూడగా అప్పటికే మాధవీలత ఆమె కుమారుడు లోకేశ్వర్‌రెడ్డి మృతి చెందారు. మాధవీలత కుమార్తె బానుమతి కొన ఊపిరి తో ఉండడంతో హుటాహుటినా బత్తలపల్లి ఆర్డీటి ఆసుపత్రికి తరలించారు. ఆ అమ్మాయికి చికిత్స చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి మాధవీలత తన పిల్లలు, తన భర్తపైన ఉన్న మమకారాన్ని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రేమను ఆప్యాతను మాధవీలత ఆ సూసైడ్ నోటులో గుర్తు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+