అఫైర్: భర్త మర్మాంగాలపై వేడి వేడి నూనె పోసిన భార్య

Posted By:
Subscribe to Oneindia Telugu

మధురై: భర్త మర్మాంగాలపై వేడి వేడి నూనె పోసిన 30 ఏళ్ల మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఆ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వేడి వేడి నూనె పోయడంతో భర్త ప్రైవేట్ పార్ట్స్‌పై కాలిన గాయాలు అయ్యాయి.

అతను ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గాయాలతో బాధపడుతున్న అతను రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. నిందితురాలిని మధురైలోి నెహ్రూ నగర్‌కు చెందిన పి. శశికళగా గుర్తించారు.

Woman booked for pouring hot oil on husband’s private parts

మహిళ భర్త ఎం పరమేశ్వరం (37) విరాట్‌పత్తులోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఆ విషయం తెలిసిన శశికళ భర్తతో గొడవ పడుతూ వస్తోంది. దాంతో అతను ఇంటికి రావడమే మానేశాడు. వివాదం ఎస్ఎస్ కాలనీ పోలీసు స్టేషన్‌లో నలుగుతోంది.

గతవారం శశికళ భర్తను ముద్దుగా పలకరించి, అతన్ని ఇంటికి ఆహ్వానించింది. శనివారం రాత్రి అతను ఇంటికి వచ్చాడు. అతను పడకపై పడుకుని నిద్ర పోతూ ఉండగా వేడి చేసిన నూనెను తెచ్చి అతని ప్రైవేట్ పార్ట్స్‌పై పోసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 30-year-old woman was booked for pouring hot oil on her husband's private parts over a family dispute.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి