సూసైడ్ నోట్ గోడకు అతికించి, పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య

Woman jumps into well along with daughter
నెల్లూరు: నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుఝామున ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో సహా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అక్కడికి సమీపంలోనే తమ చావుకు ఎవరూ కారణం కాదని ఓ కాగితాన్ని అంటించి ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి - బాలాయపల్లికి చెందిన తాళ్లూరు ప్రసాద్, సుజాత దంపతులకు జోషిక (12), సాత్విక్ (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పిల్లలు జ్యోతిక 7వ తరగతి, సాత్విక్ 4వ తరగతి వెంకటగిరిలోని భాష్యం స్కూల్లో చదువుతున్నారు. గత కొంత కాలంగా వీరి కుటుంబంలో గొడవలు ఏర్పడ్డాయని తెలిసింది. సుజాత భర్త ప్రసాద్, అత్త ఇందిరమ్మ చిత్తూరు జిల్లాలో బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లారు. సుజాత తన ఇద్దరు పిల్లలతో ఇంటి వద్దే ఉంది.

సోమవారం తెల్లవారుఝామున ఆమె తన ఇద్దరు పిల్లలతో ఇంటికి ఎదురుగా ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి వద్ద ఉన్న గోడకు మరణ వాంగ్మూలపత్రం అంటించి, ఎవరూ తమ చావుకు కారణం కాదు అని రాసింది. బావిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను వెంకటగిరి ఫైర్‌సిబ్బంది వెలికి తీశారు.

‘నా భర్త మంచివాడు.. కడుపు నొప్పికి తాళలేక తనువు చాలిస్తున్నా... భర్తకు బిడ్డలు భారం కాకూడదని నాతో పాటు వారిని తీసుకెళుతున్నా' అంటూ సూసైడ్ నోట్ రాసింది. పోలీసుస్టేషన్‌ వెనుకన పాడుబడ్డ బావిలో జోషిక మృతదేహం కనిపించింది. వెంకటగిరి అగ్నిమాపక సిబ్బందిని రప్పించి ముగ్గురి మృతదేహాలను వెలికి తీయించారు.

ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీఐ నరసింహారావు మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరికి తరలించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బాలాయపల్లిలో మృతదేహాలను పరిశీలించి కుటుంబీకులను పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+