క్రైం న్యూస్: కొడుకుతో కలిసి భర్తను చంపిన మహిళ

Woman kills husband with the help of son
హైదరాబాద్: మద్యం తాగి వేధిస్తున్న భర్తను ఓ భార్య కొడుకుతో కలిసి హతమార్చింది. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. భర్తను చంపిన అనంతరం మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

యువతిపై కిరోసిన్ పోసి..

మెదక్ జిల్లాలోని సిద్దిపేట పాత పోస్టాఫీసు దగ్గర దారుణం జరిగింది. మంగళవారం ఉదయం ఓ యువతిపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

దొంగల బీభత్సం...

నల్గొండ జిల్లాలోని చివ్వెంల మండలం ఖాసీంపేటలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటో కుటుంబ సభ్యులను నిర్బింధించిన దుండగులు 51 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ. 20 వేల నగదును చోరీ చేశారు. దోపిడీని అడ్డుకోబోయిన వారిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

బాలిక వెంట పడుతున్న యువకుడు

తనను ప్రేమించాలంటూ మైనర్ బాలిక వెంట పడుతున్న ఓ యువకుడిని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు నిదింతుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలికను వెంటాడుతూ తనను ప్రేమించాలని నిరంజన్ అనే 21 ఏళ్ల యువకుడు వెంట పడుతన్నాడు.

దాంతో విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు నిరంజన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరంజన్‌ను పోలీసులు గాలించి పట్టుకుని అరెస్టు చేశారు.

తిరుపతిలో యువకుడి హత్య

తిరుపతి ఆర్టీసి బస్సు డిపో వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు సాయినగర్‌కు చెందిన నందకిశోర్ రెడ్డి. డిగ్రీ చదువుతున్న నందకిశోర్ గతరాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరుపతి బస్టాండ్ వద్ద మృతదేహాన్ని గుర్తించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనస్థలంలో పుస్తకాలు, సంచీ పడి ఉన్నాయి. వాటి ఆధారంగా నందకిశోర్ రెడ్డిని గుర్తించారు. డబ్బు కోసం ఈ హత్య జరిగిందా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+