కల్లు తాగి రోడ్డు మీదే చితక్కొట్టుకున్న మహిళలు

woman
హైదరాబాద్: మద్యం మత్తులో మహిళలు రోడ్డు మీద కొట్టుకున్న సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌లోని ఓ కల్లు కాంపౌండ్ వద్ద కొందరు మహిళలు కల్లు తాగారు. ఈ సమయంలో పక్కనే ఉన్న మరికొందరు మహిళలతో వాగ్వాదానికి దిగారు. ఇది చినికి చినికి వాన అయింది. కొట్టుకునే వరకు వెళ్లింది.

మద్యం మత్తులో మహిళలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని నడి రోడ్డు మీదే కొట్టుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకితీసుకున్నారు. జనావాసాల మధ్య కల్లు కాంపౌండ్ ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయస్థానంలో లొంగిపోయిన ఎస్సై

అక్క కూతురిని పెళ్లి చేసుకుంటానని భార్యను వేధింపులకు గురి చేస్తున్న ఓ ఎస్సై న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు. చిత్తూరు జిల్లాలోని టిటిడిలో శ్వేత పని చేస్తున్నారు. తన భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా ముందుకు వచ్చింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. దర్యాఫ్తును ప్రారంభించారు. దీంతో సదరు ఎస్సై చిత్తూరులో న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు.

కాగా, విశాఖ జిల్లాలోని ఎస్ రాయవరంలో ఓ వ్యక్తి వేధింపులు తాళలేక బాధిత మహిళ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రాయవరం పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసముంటున్న ఓ మహిళలపై గత కొంతకాలంగా రాజేష్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రాజేష్‌ను తన ప్రవర్తన మార్చుకోవాలని ఆ మహిళ పలుమార్లు హెచ్చరించింది. అయినా రాజేష్ తన వేధింపులను అలాగే కొనసాగించాడు.

మహిళకు తన కోరిక తీర్చమని ఫోన్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడటంతో ఎక్కడ పరువు పోతుందోనని తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. రాజేష్ వేధింపుల విషయంపై బాధితురాలి బంధువులు పోలీసులను ఆశ్రయించినా వారు పట్టించుకోలేనదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+