• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జ‌గ‌న్ కు ఏం చెప్పారు..కేంద్రం త‌రువాతి అడుగు అదేనా: ప‌్ర‌పంచ బ్యాంకు రుణం ర‌ద్దుకు కార‌ణం అదే..!

|

ప్ర‌పంచ బ్యాంకు రుణం ర‌ద్దు వ్య‌వ‌హారంలో కొత్త ట్విస్ట్‌. అమ‌రావ‌తి అభివృద్దికి ప్ర‌పంచ బ్యాంకు రుణం ర‌ద్దు అవ్వ‌టా నికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కార‌ణ‌మ‌ని టీడీపీ పెద్ద ఎత్తులు ఆరోప‌ణ‌లు చేసింది. అయితే, రాజ‌ధానికి మాత్ర‌మే తాము ని ధులు నిలుపుద‌ల చేస్తున్నామ‌ని..అదే స‌మ‌యంలో ఏపీలో కొత్త ప్ర‌భుత్వానికి పూర్తిగా స‌హ‌కారం అందిస్తామ‌ని..ఇత‌ర నిధులు మాత్రం ఒప్పందం మేర‌కు అందిస్తామ‌ని ప్ర‌పంచ బ్యాంకు తేల్చి చెప్పింది. దీంతో..జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం కార‌ణం గానే ప్ర‌పంచ బ్యాంకు రుణం ఆగింద‌ని ఆరోప‌ణ‌లు చేసిన టీడీపీ నేత‌ల‌కు షాక్‌. అదే విధంగా ప్ర‌పంచ బ్యాంకు రుణం కేంద్రం కార‌ణంగానే ర‌ద్దు చేసామ‌ని తేల్చింది. అయితే, ఇది జ‌గ‌న్‌కు రిలీఫ్‌..కానీ, అస‌లు క‌ధ ఇప్పుడే మొద‌లైంది.

కేంద్ర‌మే రుణ ర‌ద్దుకు కార‌ణం..

కేంద్ర‌మే రుణ ర‌ద్దుకు కార‌ణం..

కొద్ది రోజులుగా రాజ‌కీయ దుమారానికి కార‌ణ‌మైన ప్ర‌పంచ బ్యాంకు నిర్ణ‌యం పైన ఆ బ్యాంకు ప్ర‌తినిధులు వివ‌ర‌ణ ఇ చ్చారు. రుణం ర‌ద్దుకు కార‌ణం ఏంట‌నేది విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. రాజధాని అమరావతి సుస్థిర మౌలిక వసతుల ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదనను భారత ప్రభుత్వమే విరమించున్న కార‌ణంగానే ప్రాజెక్టుపై వెనక్కి తగ్గినట్లు పేర్కొంది.
రాజధాని ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకపోయినా ఏపీలో కొత్త ప్రభుత్వానికి అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్ప‌ష్టం చేసింది. అమరావతి ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలన్న విజ్ఞప్తిని ఈ నెల 15 తేదీన భారత ప్రభుత్వం ఉపసంహరించుకుందని, ఈ నేపథ్యంలో దీనిపై తాము ముందుకు వెళ్లలేమని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డు తెలిపిందని సుదీప్‌ మొజుందర్‌ వెల్లడించారు. అయినప్పటికీ ప్రపంచ బ్యాంకు ఏపీలో ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తుల నిర్వహణ రంగాలను కవర్‌ చేసే ఒక బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. గత నెల 27వ తేదీన ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆరోగ్య రంగంలో 328 మిలియన్‌ డాలర్ల కొత్త ఆర్థిక సహాయం కూడా ఇందులో కలిసి ఉంటుందని పేర్కొన్నారు.

ఏపీకి ఇత‌ర ప్రాజెక్టుల‌కు సాయం అందిస్తాం..

ఏపీకి ఇత‌ర ప్రాజెక్టుల‌కు సాయం అందిస్తాం..

ఏపీలో కొత్త ప్రభుత్వం రూపొందించుకున్న ప్రాధామ్యాలకు అనుగుణంగా వారికి కావాల్సిన సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం విజ్ఞప్తికి లోబడి సిద్ధంగా ఉన్నామని ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధి స్ప‌ష్టం చేసారు. అయితే, స‌డ‌న్‌గా కేంద్ర ప్ర‌భుత్వం ఎందుకు త‌మ ఆలోచ‌న‌ను ఉప సంహ‌రించుకుంద‌నే అంశం పైన ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది.
దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ద్ద స‌మాచారం లేదు. అస‌లు ప్ర‌పంచ బ్యాంకు రుణం ఇస్తామ‌ని ఎప్పుడు ప్ర‌క‌టించింద‌ని అధికార పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. చంద్రబాబు హాయంలో రాజధాని అమరావతి నిర్మాణంలో లెక్కలేనన్ని ఉల్లంఘనలు, అవకతవకలు జరిగాయని అక్కడి రైతులు, పర్యావరణవేత్తలు, మేధావులు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. వాటిపై ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందాలతో పలుమార్లు విచారణ జరిపించింది. ఉల్లంఘనలు నిజమేనని తన వెబ్‌సైట్‌లో తనిఖీ బృందం నివేదికలను ఉంచింది. ఇప్పుడు కేంద్రం జోక్యంతో కొత్త చ‌ర్చ మొద‌లైంది..

కేంద్రం త‌రువాతి అడుగు అదేనా...

కేంద్రం త‌రువాతి అడుగు అదేనా...

అయితే, ప్ర‌పంచ బ్యాంకు కేంద్రం త‌మ ప్ర‌తిపాద‌న ఉపసంహ‌రించుకున్న కార‌ణంగానే తాము ప్ర‌తిపాద‌న విరించు కున్నామి ప్ర‌పంచ బ్యాంకు స్ప‌ష్టం చేసింది. ఇదే స‌మ‌యంలో దీని పైన కేంద్రం నుండి అధికారికంగా రాష్ట్ర ప్ర‌భుత్వా నికి స‌మాచారం ఇచ్చారా..లేదా అనేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అయితే, రాజ‌ధాని విష‌యంలో భారీ స్కాం జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి స్వ‌యంగా ప్ర‌ధానితో జ‌రిగిన చ‌ర్చ స‌మ‌యంలో స్ప‌ష్టం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో..
అవినీతి జరిగితే చ‌ర్య‌లు తీసుకోవ‌టంలో త‌ప్పు లేద‌ని ప్ర‌ధాని సైతం వ్యాఖ్యానించిట‌న‌ట్లు వైసీపీ ముఖ్య నేత‌లు చెబ‌తున్నారు. ఇక‌, ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్ సైతం ఇప్ప‌టికే రాజ‌ధానిలో 25శాతం కూడా పూర్తి కాని నిర్మాణాల‌ను నిలిపి వేసారు. సీఆర్డీఏ ప‌రిధిలో భూ కేటాయింపుల పైన విచార‌ణ చేస్తున్నారు. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కేంద్రం దీని పైన అవ‌స‌రమైతే..కేంద్ర దర్యాప్తు సంస్థ‌ల‌ను రంగంలోకి దించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి.. జ‌గ‌న్ ఈ విష‌యంలో కేంద్రంతో ఏ ర‌కంగా ముందుకు వెళ్తార‌నేది చూడాలి.

English summary
World bank given clarity on Loan Reject for Amaravati due to central Govt back step. At the same time Financial assistance for other projects will be continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X