వరుణ్ తేజ్ ముకుందా సినిమాకు యాదవుల సెగ
కరీంనగర్: యాదవులను కించపరిచే దృశ్యాలను చిత్రీకరించిన ముకుంద సినిమాను వెంటనే నిలిపివేయాలని శుక్రవారం తెలంగాణ యాదవ్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణ సీఐ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భం గా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చర్ల మమేందర్ యాదవ్ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముకుంద చిత్రంలో యాదవులను కించపరిచే సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. చిత్ర దర్శకుడు, నిర్మాతలపై కేసులు నమోదు చేయాలని కోరారు. గతంలో ముకుంద సినిమాకు గొల్లభామ అనే పేరు పెట్టడాన్ని తొలగించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. యాదవులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మించారు. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.
కాగా, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘ముకుందా'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలైంది. ఈ చిత్రంలో యాదవులను కించపరిచే దృశ్యాలున్నాయనే నిరసన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications