టిడిపిలో చేరిన ఎమ్మెల్యే యలమంచిలి, గద్దె అసంతృప్తి

సీమాంధ్ర పునర్నిర్మాణం టిడిపితోనే సాధ్యమని పునరుద్ఘాటించారు. అందుకు టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరముందన్నారు. క్లిష్ట సమయంలో సీమాంధ్రను పాలించే సత్తా టిడిపికే ఉందని తెలిపారు. ఇక క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని బాబు పిలుపునిచ్చారు. మున్సిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తాను నీతివంతమైన రాజకీయం చేశాను కాబట్టి టిడిపికి ఆదరణ వస్తోందన్నారు. తాను నిజాయితీతో రాజకీయం చేశానన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నిర్మాణం టిడిపికే సాధ్యమన్నారు. జెండాలు మోసిన కార్యకర్తలను విస్మరించేది లేదని, మంచి వాళ్లనే టిడిపిలోకి తీసుకుంటున్నామని చెప్పారు.
తెలుగుదేశం పార్టీలోకి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిలి రవిని చేర్చుకోవడంపై టిడిపి నేత గద్దె రామ్మోహన్ వర్గం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. రవికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జడ్పీటిసి చైర్మన్ ఎన్నిక కోసం తాను వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటానని గద్దె టిడిపిని హెచ్చరించారు.
కాగా, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఈ రోజు టిడిపిలో చేరనున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈ సీనియర్ కాంగ్రెస్ నేత సాయంత్రం 6.30 గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరతారు.
మరోవైపు, తెలుగుదేశం పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వర రావు, మండలి బుద్ధప్రసాద్ త్వరలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.












Click it and Unblock the Notifications