'వైసిపి ఎమ్మెల్యే రోజా మానసిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు, అందుకే..'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మానసిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పైన విమర్శలు చేస్తున్నారని టిడిపి నేత యామినీ బాల మంగళవారం నాడు మండిపడ్డారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మానసిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేస్తున్నారని టిడిపి నేత యామినీ బాల మంగళవారం నాడు మండిపడ్డారు.
అనంతపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును రోజా విమర్శించడం విడ్డూరమన్నారు. అసహనంతోనే చంద్రబాబుపై రోజా విమర్శలు చేస్తున్నారన్నారు. రోజా ఇలాగే విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
మనసులో మాటకు కౌంటర్

చంద్రబాబు మనసులో మాట పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. దీనిపై టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్పందించారు. మనసులో మాట రాసింది వైసీపీ నేత ఉమ్మారెడ్డేనని చెప్పారు.
జగన్ అన్ని సంపదలు కొల్లగొట్టారని, పదహారు నెలలు జైలులో గడిపారన్నారు. అభివృద్ధికి జగన్ అక్కుపక్షిలా తయారయ్యారన్నారు. వైయస్ హయాంలో ఎరువులు, విత్తనాలు బ్లాక్‌లో అమ్ముకున్నారన్నారు. మచ్చుమర్రి, గొల్లపల్లి, పైడిపాలెం ప్రారంభించి పూర్తి చేసింది టీడీపీయే అన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగిరి ఎన్టీఆర్ మానసపుత్రికలని చెప్పారు.












Click it and Unblock the Notifications