మరేం చేయాలో చెప్పు: పవన్ కళ్యాణ్‌కు యనమల ఘాటు కౌంటర్
హైదరాబాద్: భూసమీసరణ పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ఎదురు ప్రశ్న వేశారు. రైతులను ఒప్పించి భూసమీకరణ చేయాలని, బలవంతంగా చేయవద్దని పవన్ కళ్యాణ్ ఇటీవల సూచించిన విషయం తెలిసిందే.
దీనిపై యనమల మాట్లాడారు. భూసమీకరణ బలంతంగా చేయవద్దని, భూసేకరణ చట్టం ప్రయోగించవద్దని పవన్ చెప్పడం సరైనదేనని చెప్పారు. అయితే, అదే సమయంలో ఏం చేయాలో ఆయన చెబితే బాగుంటుందని ఎదురు ప్రశ్నించారు. ఏ చట్టం ద్వారా తీసుకోవాలో చెప్పాలన్నారు.
ప్యాకేజీ కోరాలి కానీ భూములు ఇవ్వమని చెబితే ఎలాగని ప్రశ్నించారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అమరావతికి వెళ్లేందుకు ఉద్యోగులు సుముఖంగా ఉన్నారని యనమల చెప్పారు.

ప్రత్యేక హోదా పైన మాట్లాడుతూ... బీహార్ ప్యాకేజీతో ఏపీకి పోలిక, సంబంధం లేదన్నారు. ఏపీకి రూ.25వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు. ఏపీలో రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాలని సూచించారు.
ఏపీకి ప్రత్యేక హోదా పార్లమెంటు ఇచ్చిన హామీ అని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, అలాగే ప్యాకేజీ కూడా కావాలన్నారు. యూపిఏ హయాంలో ఏపీ అంటే చులకనగా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.












Click it and Unblock the Notifications