జగన్‌కు యనమల ప్రశ్నలు: కెసిఆర్‌కు జానా లేఖ
హైదరాబాద్: నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనడంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రశ్నల వర్షం కురిపించారు. మోడీకి ఏయే అంశాల ప్రాతిపదికపై జగన్ మద్దతు ఇస్తారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
మోడీకి ఏ అంశంపై మోడీకి మద్దతిస్తారని, బెయిల్ అంశంపైనా, కేసులను బలహీనపరిచే అంశమా, మిగిలిన ఆస్తులు జప్తు చేయకుండా ఉండేందుకా అని ఆయన ప్రశ్నించారు. ఈడి దర్యాప్తు నుంచి బయట పడేందుకు నరేంద్ర మోడీకి జగన్ మద్దతు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కాంగ్రెసు నేత, మాజీ మంత్రి కె. జానారెడ్డి లేఖ రాశారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో కెసిఆర్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వానికి తాము పూర్తిగా సహకరిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడుతున్నందుకు కెసిఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగామ ప్రజల ఆకాంక్షలను కెసిఆర్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన కోరారు. అందుకు కాంగ్రెసు పార్టీ సహకారం ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications