అసెంబ్లీ నిర్మాణంపై చంద్రబాబుతో చర్చించిన తర్వాతే: సమీక్ష తర్వాత యనమల
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఏపీ అసెంబ్లీ భవన సముదాయ నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు సీఆర్‌డీఏ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, భవన నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఆరో భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలా, వద్దా అన్నఅంశంపై ఈ సమావేశంలో చర్చించారు. శాసనసభ ప్రాంగణం, భద్రతపై పోలీసులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తాత్కాలికి సచివాలయంకు భిన్నంగా అసెంబ్లీ భవన నిర్మాణం ఉంటుందని చెప్పారు.

డిసెంబరు చివరి నాటికి అసెంబ్లీ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని నిర్మాణ సంస్ధళకు ఆదేశించినట్లు ఆయన వివరించారు. శాసనసభ పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఎల్పీ కార్యాలయాలు, చాంబర్ల ఏర్పాటు జరుగుతుందని అన్నారు.
అసెంబ్లీ భవనం చుట్టూ ప్రహరీగోడ నిర్మాణం జరుగుతోందని ఆయన అన్నారు. అసెంబ్లీ భవన సముదాయ నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై చంద్రబాబు సమీక్షంలో మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.












Click it and Unblock the Notifications