జగన్‌కు యనమల ఫోన్: బుద్ధప్రసాద్ ఏకగ్రీవమే

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శానససభ డిప్యూటీ స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు.

డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించాలని యనమల జగన్‌ను కోరారు. డిప్యూటీ స్పీకర్ పదవికి మండలి బుద్ధప్రసాద్ శుక్రవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. బుద్ధప్రసాద్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

Yanamala speaks to Jagan: Budhaprasad will be unanimous

ఆంధ్రప్రదేశ్ శానససభ స్పీకర్‌గా సీనియర్ తెలుగుదేశం శాసనసభ్యుడు కోడెల శివప్రసాద్ ఎన్నికైన విషయం తెలిసిందే. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన వైయస్ జగన్ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు కూడా సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా, తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్‌గా కాల్వ శ్రీనివాసులను ఎన్నుకుంది. విప్‌లుగా యామిని బాల, చింతమనేని ప్రభాకర్, మేడా మల్లికార్జున్ రెడ్డి, కూన రవికుమార్ వ్యవహరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+