సర్వేల పై చంద్రబాబు సీరియస్ కామెంట్లు : జగన్ కు అది అలవాటే : 2014 లో ఏమైందంటే..!
Recommended Video

జాతీయ మీడియా వెల్లడించిన సర్వేల పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక కామెంట్లు చేసారు. 2014 ఎన్నికల సమ యం లో ఏం చేసారో గుర్తు చేసారు. జగన్ అహంభావం భరించలేకే అనేక మంది వైకాపాకు దూరమవుతున్నారని సీఎం చంద్ర బాబునాయుడు అన్నారు. ఏపీకి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరిందని అయితే వైసీపీ, బీజేపీకి బాధ్యత లేదని..వారికి ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు.

దొంగ సర్వేలు అలవాటే..
కొన్ని జాతీయ ఛానళ్లు ఏపిలో వైసిపికి 19 లోక్‌సభ సీట్లు వస్తాయంటూ విడుదల చేసిస సర్వేల పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. సానుకూల నాయకత్వానికి తెదేపా.. ప్రతికూల నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జగన్‌కు అలవాటేనని.. ఆ సర్వే లతో ప్రజాదరణను తారుమారు చేయలేరన్నారు.

తెదేపా ఘన విజయం
2014 ఎన్నికల ముందు కూడా ఇదేవిధంగా తప్పుడు సర్వేలు చేశా రని, ఫలితాల్లో తెదేపా ఘన విజయం సాధించిన విషయం గుర్తుచేశారు. ప్రజాభిమానాన్ని తెదేపాకి దూరం చేయడం అసాధ్యమన్నారు. డబ్బుతో దేనినైనా కొంటాననేది జగన్ అహంభావమని సీఎం ధ్వజమెత్తారు. జగన్ అహంభావం భరించలేకే వైసీపీకి నేతలు దూరం అవుతున్నారని తెలిపారు.

మోదీకి ఇంటికి పోయే టైమ్ వచ్చింది..
ప్రధాని మోదీ ఇంటికి పోయే టైమ్ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ నినాదం మార్మోగుతోందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను దేశం భరించదని వ్యాఖ్యానించారు. రైతులు, మహి ళలు, యువత బీజేపీ, వైసీపీకి దూరంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ, దాని కీలుబొమ్మ పార్టీలకు ఓటమి తప్ప దని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కలిసికట్టుగా ముందుకు పోవాలని సూచించారు. ఐదేళ్లలో చేసింది గొప్ప చరిత్ర అని, రాబోయే ఐదేళ్లలో చేసేది మరో చరిత్ర అని చెప్పారు. ఇంతకు రెట్టింపు రాష్ట్రాభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications