వైసీపీ లీడర్ బోరుగడ్డకు బోరు వెయ్యాలని పోలీసులు డిసైడ్ అయ్యారు !!

తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులను నోటికి వచ్చినట్లు అమ్మనా బూతులు తిట్టిన వైసీపీ నాయకుడు, గుంటూరు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అలియాస్ బోరుగడ్డ అనిల్ కొన్ని కీలక విషయాలు చెప్పాడని పోలీసులు అంటున్నారు, వైసీపీ నాయకులు తనను ప్రోత్సహించడం, రెచ్చగొట్టడంతో అప్పటి ప్రతిపక్ష నాయకులను నోటికి వచ్చినట్లు మాట్లాడానని బోరుగడ్డ అనిల్ అతను చేసిన తప్పు అంగీకరించాడని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

అయితే వైసీపీకి చెందిన నాయకుల్లో ఎవరెవరు తనను రెచ్చగొట్టారు అనే విషయంలో బోరుగడ్డ అనిల్ క్లారిటీ ఇవ్వడంలేదని పోలీసు అధికారులు అన్నారు. బోరుగడ్డ అనిల్ కు కోర్టు 13 రోజులు రిమాండ్ విధించడంతో అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపించారు. కోర్టు అనుమతితో బోరుగడ్డ అనిల్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే మరింత సమాచారం బయటకు వస్తుందని గుంటూరులోని అరండల్ పేట్ డీఎస్పీ జయరాం రాంప్రసాద్ అంటున్నారు.

YCP leader Borugadda Anil said important things during the police investigation

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బోరుగడ్డ అనిల్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తోపాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులను నోటికి వచ్చినట్లు తిట్టాడు. బోరుగడ్డ అనిల్ రౌడీ షీటర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే బోరుగడ్డ అనిల్ మాత్రం ఎవరినిపడితే వాళ్లని నోటికి వచ్చినట్లు తిట్టాడు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో పాటు మహిళలను కూడా అమ్మనా బూతులు తిట్టిన బోరుగడ్డ అనిల్ నన్ను ఎవరు ఏమి చేసుకోలేరని బహిరంగంగా సవాల్ విసిరాడు.

2021లో బాబు ప్రకాష్ అనే వ్యక్తిని డబ్బుల కోసం బెదిరించాడని అరండల్ పేట పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదు అయ్యింది. బోరుగడ్డ అనిల్ రౌడీ షీటర్ అయినా అతని మీద కేసు నమోదు అయినా అప్పట్లో గుంటూరు జిల్లా వైసీపీ నాయకుల ఒత్తిడితో అతని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు బోరుగడ్డ అనిల్ నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బోరుగడ్డ అనిల్ మాయం అయ్యడు.

YCP leader Borugadda Anil said important things during the police investigation

అప్పటినుండి బోరుగడ్డ అనిల్ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. చివరికి బోరుగడ్డ అనిల్ పోలీసుల వలలో పడ్డాడు. తనను గుంటూరు జిల్లా వైసీపీ నాయకులు రెచ్చగొట్టడం వలనే తాను తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులను నోటికి వచ్చినట్లు తిట్టాను అని, ఇకముందు ఎవరినీ ఇలా మాట్లాడను అని బోరుగడ్డ పోలీసుల విచారణలో చెప్పాడని తెలిసింది. తాను నాయకుడిగా ఎదిగిపోతానని వైసీపీ నాయకులు రెచ్చగొట్టడం వలన తాను అందరినీ దూషించాను అని బోరుగడ్డ అనిల్ అన్నాడని తెలిసింది.

బోరుగడ్డ అనిల్ పైన గుంటూరు జిల్లాలోని 20కి పైగా కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బోరుగడ్డ అనిల్ మీద అనేక కేసులు ఉన్నా అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా బోరుగడ్డ అనిల్ ను టచ్ చేయలేదని, మా పార్టీ అధికారంలో ఉందని, తనను ఎవరూ ఏమి చేయలేరని బోరుగడ్డ అనిల్ అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+