Duvvada Srinivas, Divvela Madhuri: భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా..!
వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ బాగోతం మరోసారి రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ తన కన్నా వయస్సులో చాలా చిన్నదైన మాధురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దువ్వాడ వాణి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో ఈ విషయం భయటపడింది. మాధురి తన భర్తను వలలో వేసుకుందని.. తన ఇంటిని తనకు కాకుండా చేస్తోందని వాణి ఆరోపించారు.
ఏపీ వ్యాప్తంగా ఈ అంశం కొద్ది రోజులు చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత వాణి వెనక్కు తగ్గడంతో సమస్య సమసిపోయిందని అనుకున్నారు. అయితే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణికి షాక్ ఇచ్చారు. ఇంటిని మాధురి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు.టెక్కలి నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటిని దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయిపోయిందని మాధురి తెలిపారు.

ఇల్లు తన పేరుతో రాయడంతో మాధురి ఆ ఇంట్లోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న వాణి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని వాణి ధర్నాకు దిగడంతో దువ్వాడ శ్రీనివాస్ ఆయనకు ఇద్దరు వివాదం మరోసారి రచ్చకెక్కింది. దివ్వెల మాధురి మాత్రం ఇల్లు తనేదనని చెబుతున్నారు.

దువ్వాడ శ్రీనివాస్ తనకు రూ.2 కోట్లు ఇవ్వాలని చెప్పారు. డబ్బు లేకపోవడంతో అక్కవరం ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని మాధురి వీడియో విడుదల చేశారు. తన ఇంటి వద్ద దువ్వాడ వాణి అల్లరి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంటికి విద్యుత్ కూడా నిలిపివేయించారని మండిపడ్డారు. "నా ఇంట్లో నేనున్నాను... వాళ్లెవరు నా ఇంట్లోకి రావడానికి అంటూ" మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటి రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన పత్రాలు కూడా మాధురి చూపించారు.

మాధురి వీడియోపై సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ మీకు రూ. 2 కోట్లు ఇవ్వాలా.. అందుకే ఇళ్లు రాసిచ్చారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ పై పార్టీ చర్యలు తీసుకోవాలని లేకుంటే పార్టీ నష్టం వచ్చే ప్రమాదం ఉంటుందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications