సాయిరెడ్డి పై వైసీపీ గురి - మారిన లెక్క, ఢిల్లీ కేంద్రంగా..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జగన్ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడారు. విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి నిష్క్రమణ తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నా యి. సాయిరెడ్డి తాజాగా రష్మిలతో భేటీ రాజకీయంగా కొత్త చర్చకు కారణమైంది. సాయిరెడ్డి తనతో చేసిన చర్చలను షర్మిల వెల్లడించారు. అటు ఢిల్లీలో ఏపీ కేంద్రంగా కీలక మంత్రాంగం సాగుతోం ది. ఈ సమయంలో సాయిరెడ్డి పై వైసీపీ గురి పెట్టింది. ముఖ్య నేతలు రంగంలోకి దిగారు.

సాయిరెడ్డి నిర్ణయంతో
జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో సాయిరెడ్డి తన రాజకీయ నిష్క్రమణ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయం గురించి జగన్ కు చెప్పగా.. వద్దని సూచించారని చెప్పుకొచ్చారు. ఆ తరువాత సాయిరెడ్డి తాను ఏ పార్టీలో చేరటం లేదని స్పష్టం చేసారు. తాజాగా షర్మిలతో సాయిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం వైసీపీ కేడర్ కు నచ్చలేదు. సాయిరెడ్డి - షర్మిల భేటీ గురించి రాజ కీయంగా చర్చ జరిగింది. సాయిరెడ్డి తనతో మాట్లాడిన అంశాలను తాజాగా షర్మిల బయట పెట్టారు. దీంతో, వైసీపీ నేతలు ఇప్పుడు సాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.

YCP leader Ketireddy Seriously Reacts over Vijaya Sai reddy comments against YS Jagan

జగన్ వర్సస్ సాయిరెడ్డి
అటు జగన్ పార్టీ వీడిన వారి పైన స్పందించారు. ఎవరికైనా విశ్వసనీయత ముఖ్యమని.. సాయిరెడ్డి తో సహా అందిరికీ ఇదే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా జగన్ పేరు ప్రస్తావన లేకుండానే సాయిరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అయింది. అందులో వ్యక్తిగత జీవితంలో కూడా విలువ లు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నానని పేర్కొన్నారు. దీని పైన వైసీపీ మద్దతు దారులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇక, షర్మిల కామెంట్స్ తో ఇప్పుడు వైసీపీ ముఖ్య నేత కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి నేరుగా సాయిరెడ్డి ని టార్గెట్ చేసారు.

కేతిరెడ్డి కామెంట్స్
ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టింగ్ సంచలనంగా మారింది. అందులో.. రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నాయకుడు ఎవరన్నదీ ప్రజలందరికీ తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కాబట్టే, కనీస రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆడిటర్‌గా ఉన్న వ్యక్తి అన్ని హోదాలు, అన్ని పదవులు అనుభవించాడు. పార్టీలో గొప్పగౌరవాన్ని పొందిన తర్వాత బయటకు వెళ్లిన తర్వాత మీకేదో చెప్పాడని, దాన్ని మాట్లాడ్డం అంటే, వైయస్‌.కుటుంబం యొక్క పరువును బజారుకు ఈడుస్తున్నది ఎవరో, ఇది ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.. అని పేర్కొన్నారు. దీంతో.. ఇప్పుడు సాయిరెడ్డి ఎపిసోడ్ లో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో వైసీపీ అలర్ట్ అయింది. కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+