Raghuramaపై అనర్హత వేటు అప్ డేట్ : స్పీకర్ తో సాయిరెడ్డి కీలక భేటీ : చర్యలు ఖాయమంటూ..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు పైన అనర్హత వేటు అంశం ఢిల్లీలో ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ..ఆయన పైన అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే పలు మార్లు వైసీపీ నేతలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఇక, ఇప్పుడు తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు విజయ్ సాయిరెడ్డి,మిథున్ రెడ్డి, మార్గాని‌భరత్ మరో సారి ఈ రోజు స్పీకర్ ను కలిసారు. రఘురామ పైన చర్యలు తీసుకోవాలని మరోసారి కోరారు.

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన సమయంలో పార్టీ విప్ భరత్ నేరుగా స్పీకర్ ను కలిసి రఘురామ రాజు పైన అనర్హత వేటు కోసం అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించామని చెప్పారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి స్పీకర్ కు లేఖ రాసారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. చర్యలు తీసుకోకపోవటం పైన ఒక విధంగా ప్రశ్నించారు. ఇదే సమయంలో అటు నుంచి..రఘురామ రాజు సైతం పలు మార్లు లోక్ సభ స్పీకర్ ను కలిసారు. తాను ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసు పైన చర్యలు తీసుకోవాలని కోరారు.

YCP leaders appeal to loksabha speaker Ombirla to disqualify Raghu Rama from loksabha

అదే విధంగా తన పైన అనర్హత వేటు వేయటానికి అవకాశం లేదని రఘురామ ధీమాగా చెబుతున్నారు. ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభం కానున్న సమావేశాల్లో తన పైన జరిగిన దాడి పైన తొలి రోజునే మాట్లాడే అవకాశం ఇవ్వాలని నేరుగా స్పీకర్ ను రఘురామ కోరారు. ఇక, ఇప్పుడు స్వయంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు స్పీకర్ ను కలిసి తమ వాదన మరోసారి వినిపించారు. నిత్యం సీఎం కు బహిరంగ లేఖలు రాస్తున్న రఘురామ రాజు పైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రాంభం అయ్యే లోగానే చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.

Recommended Video

    Union Cabinet Reshuffle : దక్షిణాదిన ఏపీకి మొండిచెయ్యి | Impact On AP Key Projects | Oneindia Telugu

    ఇక, స్పీకర్ తో సమావేశం తరువాత కూడా వైసీపీ నేతలు రఘురామ రాజు పైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని ధీమాగా చెబుతున్నారు. మరి సమావేశాలు ప్రారంభం కావటానికి మరో పది రోజు సమయం ఉంది. ఈ లోగా వైసీపీ నేతలు కోరుకుంటున్న విధంగా రఘురామ పైన చర్యలు ఉంటాయా లేదా అనేది వేచి చూడాల్సిందే. కానీ, రఘురామ ఎపిసోడ్ పైన స్పీకర్ కు ఫిర్యాదు చేయటం మినమా..ఆయన వ్యాఖ్యలు - లేఖల పైన మాత్రం వైసీపీ నేతలు ఎక్కడా స్పందించటం లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+