వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధూళిపాళ్ల‌ను అడ్డుకున్న గ్రామ‌స్తులు.. కారు ధ్వంసం.. ఉద్రిక్త‌త‌

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లా అనమర్లపూడిలో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. మ‌ట్టితవ్వ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఫిర్యాదు చేయ‌డంతో పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి ధూళిపాళ్ల న‌రేంద్రం ఆ ప్రాంతాన్ని ప‌రిశీలించ‌డానికి అన‌మ‌ర్ల‌పూడి వెళ్లారు. అయితే న‌రేంద్ర‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవ‌డంతోపాటు అత‌ని కారు వెన‌క‌వైపు అద్దాల‌ను ప‌గ‌ల‌గొట్టారు. గోబ్యాక్ న‌రేంద్ర‌, డౌన్ డౌన్ ధూళిపాళ్ల అంటూ నినాదాలు చేశారు.

మ‌ట్టి త‌వ్వ‌కాల ప‌రిశీల‌న‌కు వెళ్ల‌కుండా ధూళ్లిపాళ్ల నరేంద్ర ను అడ్డుకోవ‌డానికే కారు ధ్వంసానికి పాల్ప‌డ్డార‌ని తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు. అన‌మ‌ర్ల‌పూడి అనే కాకుండా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో క్వారీ, వ‌డ్ల‌మూడి, సంగంజాగ‌ర్ల‌మూడి, చేబ్రోలు త‌దిత‌ర ప్రాంతాల్లో అక్ర‌మంగా వైసీపీ నాయ‌కులు మ‌ట్టిత‌వ్వ‌కాలు జ‌రుపుతున్నార‌ని, దీనివ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణ స‌మతుల్య‌త దెబ్బ‌తింటోంద‌ని ధూళిపాళ్ల న‌రేంద్ర ఆరోపిస్తున్నారు. గ‌తంలో కూడా చేబ్రోలు స‌మీపంలో మ‌ట్టి త‌వ్వ‌కాల‌ను ప‌రిశీలించ‌డానికి వెళ్ల‌గా అక్క‌డ కూడా వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఎదురుతిరిగారు.

ycp leaders blocking the dhulipalla narendra and his car wreckage.. high tension in anumarlapudi

పొన్నూరు ఎమ్మెల్యేగా కిలారి రోశ‌య్య ఎన్నికైన త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో ఆగ‌డాలు పెచ్చుమీరిపోయాయ‌ని ధూళిపాళ్ల న‌రేంద్ర ఆరోపించారు. నియోజ‌క‌వ‌ర్గంలో పోలీసు రాజ్యం న‌డుస్తోంద‌ని, తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు పెడుతున్నారంటూ మండిప‌డ్డారు. ఎవ‌రెవ‌రు? ఎక్క‌డెక్క‌డ‌? ఎంతెంత‌? మ‌ట్టి త‌వ్వ‌కాలు చేప‌ట్టింది అన్న విష‌యం వివ‌రాల‌తో స‌హా సేక‌రించామ‌ని, పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ఉప‌యోగం లేద‌ని, తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌వ్విన మ‌ట్టితో స‌హా అన్నీ వ‌సూలు చేయిస్తామ‌ని హెచ్చ‌రించారు. అన్యాయం జ‌రుగుతోంది కాబ‌ట్టే త‌న కారును అడ్డుకున్నార‌ని న‌రేంద్ర మండిప‌డ్డారు.

English summary
ycp leaders blocking the dhulipalla narendra and his car breckage.. high tension in anumarlapudi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X