రాసుకో సాంబా.. క్యా(రేప్‌) డైలాగ్ హై?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న కొన్ని సంఘ‌ట‌న‌ల‌పై ప్ర‌భుత్వాధినేత‌తోపాటు మంత్రులు, అధికార పార్టీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు సినిమాల్లో డైలాగుల కోసం ఉప‌యోపడ‌తాయ‌ని ప‌లువురు సినీ ర‌చ‌యిత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈత‌ర‌హా వ్యాఖ్య‌లు విన‌డం కూడా ఇదే మొద‌టిసార‌ని, వీలుంటే వాటిని రాసిపెట్టుకొని త‌మ త‌ర్వాత సినిమాల‌కు వాడ‌తామ‌ని చెబుతున్నారు.

 1తెలుగుదేశం ప‌నే!

1తెలుగుదేశం ప‌నే!

ఏపీలో వ‌రుస‌గా జ‌రుగుతున్న అత్యాచార సంఘ‌ట‌న‌ల‌న్నీ ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీవారి ప‌నేన‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. విజ‌య‌వాడ ప్ర‌భుత్వాస్ప‌త్రిలో గ్యాంగ్‌రేప్‌, రేప‌ల్లె, విశాఖ‌ప‌ట్నంలోని సంఘ‌ట‌న‌లే కాదు.. ఎక్క‌డ ఏ సంఘ‌ట‌న జ‌రిగినా దానికి ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీదే బాధ్య‌త అని అధికార పార్టీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.

అత్యాచారాలు తెలుగుదేశంవారే చేస్తున్నారు!

అత్యాచారాలు తెలుగుదేశంవారే చేస్తున్నారు!


ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి అత్యాచారాలు చేసిన‌వారంతా తెలుగుదేశం పార్టీవారేన‌ని, వారిగురించి ఎల్లో మీడియా రాయ‌ద‌ని, జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను కూడా వ‌క్రీక‌రించి రాస్తున్నాయంటూ ఆరోపించారు. ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ నుంచి రాష్ట్రాన్ని కాపాడాల‌ని వెంక‌టేశ్వ‌ర‌స్వామిని కోరుకున్న‌ట్లు కూడా తెలిపారు.

కిరాయి గూండాల‌తో నేరాలు

కిరాయి గూండాల‌తో నేరాలు


తాజాగా వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి అత్యాచారాల‌న్నీ తెలుగుదేశం పార్టీవారి ప‌నేన‌ని, కిరాయి గూండాల‌ను పెట్టి నేరాలు చేయిస్తున్నారంటూ ఆరోపించారు. నిందితుల‌ను ప‌ట్టుకొని క‌ఠినంగా శిక్షించ‌కుండా, నేరాలు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతూ త‌ప్పించుకోచూస్తోందంటూ సామాజిక‌వేత్త‌లు విమ‌ర్శిస్తున్నారు.

 అప్ప‌టి ప‌రిస్థితుల‌వ‌ల్ల రేప్ జ‌రిగింది??

అప్ప‌టి ప‌రిస్థితుల‌వ‌ల్ల రేప్ జ‌రిగింది??


రేప‌ల్లె బ‌స్టాండ్‌లో జ‌రిగిన అత్యాచారం ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగింది కాద‌ని, ఆ స‌మ‌యంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు జ‌రిగింద‌ని మ‌హిళా హోం మంత్రి అయిన తానేటి వ‌నిత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగ‌డ‌మేకాదు జాతీయ మీడియా కూడా ఈ వ్యాఖ్య‌ల‌ను బాగా హైలైట్ చేశాయి.

రాష్ట్రంలో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని, అందుకు త‌గ్గ‌ట్లుగా పోలీసుశాఖ‌ను స‌మ‌ర్థ‌వంతంగా తీర్చిదిద్దాల‌ని, కానీ హోం మంత్రే అత్యాచారం గురించి నిందితులకు మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నారంటూ మ‌హిళా సంఘాలు మండిప‌డుతున్నాయి. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లను అదుపుచేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని, ఇప్ప‌టికైనా ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు మాని ప‌రిపాల‌న‌ను గాడిన‌పెట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+